NTV Telugu Site icon

Viral News: మోడ్రన్ బిచ్చగాడు..చేతిలో క్యూఆర్‌ కోడ్‌తో భిక్షాటన..

Trending Begger

Trending Begger

రెండు చేతులు, కాళ్లు బాగానే ఉన్న కొందరు సోమరి పొతులుగా మారుతున్నారు.. అలాంటి వాళ్ళు రోడ్ల మీద, రైళ్ల లో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వారి గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు.. సాధారణంగా రైళ్లలోని సాధారణ కోచ్‌లలో యాచకులు పాటలు పాడుతూ అడుక్కుంటూ ఉంటారు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో రైళ్ళల్లో బిక్షగాళ్లు ఉంటారు.. అయితే వారి చేతిలో మాములుగా సంచి లేదా బొచ్చే ఉండటం మనం చూస్తూనే ఉంటాం.. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇప్పుడు వాళ్ళు కూడా డిజిటల్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.. చేతిలో క్యూఆర్‌ కోడ్‌తో భిక్షాటన చేస్తున్నారు.. తాజాగా ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది..

వీడియోలో ఒక బిచ్చగాడు తన చేతిలో క్యూఆర్ కోడ్‌తో ప్రజలను వేడుకుంటాడు. రైలులో ఉన్న ఓ వ్యక్తి తన భిక్షాటన తీరును రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది. సాధారణంగా ఒక బిచ్చగాడు వచ్చి దానం చేయమని అడిగితే.. కొందరు చిల్లర ఉంటే వేస్తారు. మరికొందరు తినేందుకు ఏదైనా ఉంటే ఇస్తారు.. ఇంకొందరు చిల్లర లేదని తిప్పి పంపించేస్తుంటారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి నగదు లేదనే చెప్పాలి. అయితే ఈ బిచ్చగాడు తన దూరదృష్టిని ఉపయోగించి చేతిలో క్యూఆర్ కోడ్‌తో అడుక్కుంటున్నాడు. లోకల్ రైలులో భారీ జనసందోహం మధ్య ఓ వ్యక్తి చేతిలో క్యూఆర్ కోడ్‌తో పాట పాడుతూ అడుక్కుంటున్న వీడియో ఒకటి వెలుగు చూసింది..

అతన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.. క్యూఆర్ కోడ్‌లు పట్టుకుని రోడ్డు పక్కన బిచ్చగాళ్లు నిలబడిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ముంబైలో చిత్రీకరించినట్లు సమాచారం. అక్కడ ఒక బిచ్చగాడు పాట పాడుతూ భిక్షాటన చేయడాన్ని చూడవచ్చు.. అది చూసిన స్థానికులు కూడా ఆశ్చర్య పోతున్నారు.. ఈ ఘటన వీడియో వైరల్ అవ్వడంతో ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే లైకులు, కామెంట్స్ తో దూసుకుపోతుంది..