Site icon NTV Telugu

Viral News: స్మార్ట్‌ ఫోన్‌ కొంటే టమాటాలు ఫ్రీ..ఫ్రీ.. ఎక్కడంటే?

Smart Phones (2)

Smart Phones (2)

జనాల తెలివి రోజురోజుకు పెరిగిపోతుంది.. మార్కెట్ కు తగ్గట్లు బిజినెస్ చెయ్యడంలో తెలివి మీరిపోతున్నారు.. ప్రస్తుతం మార్కెట్ లో టమోటా ధరలు మండిపోతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.200 లకు పైగా పలుకుతుంది.. ఇక . కొన్ని చోట్ల అయితే రూ. 250కి చేరువుతోంది. దీంతో ప్రజలు టమాట అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.. జనాలు పొద్దున్నే లేచినప్పటి నుంచి టమోటా ధరల పై చర్చిస్తున్నారు.. టమోటాలతో చేసే వంటల మాట పక్కన పెడితే అస్సలు టమోటాలను వంటల్లో వెయ్యడం లేదంటే నమ్మాలి..

మార్కెట్ లో అంతలా టమోటా ధరలు భారీగా పెరిగాయి.. సామాన్యులకు ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. ఒక్క టమోటా మాత్రమే కాదు అన్నీ కూరగాయలు అలానే ఉన్నాయి.. అందుకే జనాలు ఇప్పుడు చికెన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఇలాంటి తరుణంలో ఓ దుకాణం అతను అదిరిపోయే బంఫర్ ఆఫర్ ను ప్రకటించారు. అదేంటంటే.. స్మార్ట్ ఫోన్ కొంటె రెండు కేజిల టమోటాలు ఫ్రీ అని ప్రకటించారు.. దీనికి జనాల్లో మంచి స్పందన వస్తుంది..

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌ నగర్‌లో అశోక్‌ అగర్వాల్‌ అనే యువకుడు మొబైల్‌ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెరిగిన టమాట ధరలను తన షాప్‌ ప్రచారానికి వాడుకోవాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా తన దుకాణంలో స్మార్ట్‌ ఫోన్‌ కొంటే 2 కిలోల టమాట ఫ్రీ అంటూ ఫ్లెక్సీలో వేశాడు. దీంతో స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారంతా అశోక్‌ దుకాణానికి క్యూ కడుతున్నారు. ఈ ప్రకటన తర్వాత తన షాపులో అమ్మకాలు పెరిగాయని చెప్పుకొచ్చాడు అశోక్‌.. మొత్తానికి అతని ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యిందని చెబుతున్నారు. ఇంతలా పెరిగిపోతున్న టమోటా ధరల పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

Exit mobile version