గర్ల్ ఫ్రెండ్ అంటే చచ్చేంత ఇష్టం ఉన్న ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు.. చివరికి అడ్డంగా బుక్కయ్యి లబో దిబో అన్నాడు.. గర్ల్ ఫ్రెండ్ ను సంతోష పెట్టడానికి ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు .. అత్యుత్సహంతో ఆమెని అడిగాడు .. ఆమె తన పరీక్ష రాయాలని కోరింది .. మొదట షాక్ అయినా తర్వాత ఆమె కోరిక మేరకు అమ్మాయిలాగా మారి పరీక్ష రాయడానికి వెళ్ళాడు.. అమ్మాయిల డ్రెస్ ధరించి బొట్టు, గాజులు, లిప్ స్టిక్‌లతో సింగారించుకున్నాడు. ఆయన అమ్మాయి వేషంలో ఉన్న నకిలీ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు కూడా తయారు చేసుకున్నాడు. అంతా ఓకే అనుకున్నాక ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ అన్నీ సరిగానే మేనేజ్ చేసినా కూడా అక్కడ అడ్డంగా బుక్కయ్యాడు..
ఈ మధ్య ఎగ్జామ్ కోసం బయోమెట్రిక్ వచ్చిన సంగతి తెలిసిందే.. అన్ని మేనేజ్ చేసినా కూడా బయోమెట్రిక్ దగ్గర దొరికిపోయాడు ప్రబుద్దుడు.. ఈ ఘటన పంజాబ్ లో వెలుగు చూసింది.. పంజాబ్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పరీక్షలో ఈ ఘటన జరిగింది. ఈ యూనివర్సిటీ జనవరి 7వ తేదీన మల్టి పర్పస్ హెల్త్ వర్కర్స్ ఎగ్జామ్ నిర్వహించింది. పరమ్ జీత్ కౌర్ అనే యువతి అప్లై చేసుకుంది. కానీ, ఆమె స్థానంలో పరీక్ష రాయడానికి ఆమె బాయ్‌ఫ్రెండ్ అంగ్రేజ్ సింగ్ వెళ్లాలని అనుకున్నాడు.. అన్ని ఎప్పుడో సిద్ధం చేసుకున్నాడు..
ఎవరూ గుర్తు పట్టకుండా తన డ్రెస్సింగ్, మేకప్ మొత్తంగా మార్చుకున్నాడు. అమ్మాయి అవతారం ఎత్తాడు. అంతేకాదు, అమ్మాయి వేషంలో ఉన్న తన ఫొటోలతో నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేసుకున్నాడు.అన్ని సరిగ్గా ఉండటంతో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు .. కానీ బయోమెట్రిక్ వెయ్యడానికి రాలేదు .. ఇక అనుమానం రావడంతో గట్టిగ అడగడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు.. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసారు.. అయ్యో పాపం ఎంత పనైంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..
