NTV Telugu Site icon

Viral News : బొమ్మను పెళ్లి చేసుకున్న మహిళ.. ఇప్పుడు బిడ్డను కూడా.. ఇదేం విచిత్రం భయ్యా..

Doll

Doll

ఈ మధ్య పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కో చోట ఒక్కో వింత పెళ్లి జరిగింది.. చెట్టుతో పెళ్లితో, తనకు తాను పెళ్లి చేసుకోవడం ఇలాంటివి ఇటీవల ఎక్కువ చూస్తున్నాం.. తాజాగా ఓ మహిళ బొమ్మను పెళ్లి చేసుకుంది.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. బిడ్డను కూడా కనింది.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. కాస్త వివరంగా తెలుసుకుందాం..

జీవం లేని బొమ్మను సైతం జీవిత భాగస్వామిగా చేసుకుంది ఓ మహిళ. ఆశ్చర్యపోతున్నారా? గతంలో వైరల్ అయిన ఈ స్టోరి మళ్లీ బయటకు వచ్చింది.. చిన్నతనంలో బొమ్మల పెళ్లి ఆటలు ఆడుకున్న వారు ఉండే ఉంటారు. సరదాగా బొమ్మలకు పెళ్లి చేసి పిల్లలు సంబరపడతారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది ఓ మహిళ బొమ్మనే పెళ్లి చేసుకున్న కథ. విచిత్రంగా ఉన్నా నిజం.. బ్రెజిల్ కు సంబందించిన ఓ మహిళ చేతితో తయారు చేసిన బొమ్మతో ప్రేమలో పడింది.. ఆ బొమ్మను పెళ్లి చేసుకోవాలని అనుకుంది..

ఆ బొమ్మను ఆమె తల్లి ఇంట్లో తయారు చేసింది. ఆ బొమ్మకు మార్సెలో మోరేస్ అని పేరు కూడా పెట్టారు. ఆ బొమ్మను మోరేస్ పెళ్లి చేసుకుంది. రీసెంట్‌గా ఈ జంటకు ఓ బిడ్డ కూడా పుట్టింది.. నిజమేనా? అయితే ఈమెతో డ్యాన్స్ చెయ్యడానికి తోడు లేడని తెగ ఫీల్ అయ్యేది.. డాన్స్ పార్టనర్ డొరకడంతో పాటు మార్సెలోనే పెళ్లి చేసేసుకుంది. వారి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా సాగుతోందట. ఆ బొమ్మ తనతో వాదించదని, కొట్టుకోవడం ఉండదని.. ఎప్పుడూ తనను అర్ధం చేసుకుంటుందని మార్సెలో గొప్ప నమ్మకమైన భర్త అని మోరేస్ మురిసిపోతోంది. అంతేనా ఆసుపత్రిలో ఓ పురుడు కార్యక్రమం జరిగింది. ఈ జంట ఓ బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు. త్వరలో రెండో బిడ్డ తమ జీవితంలోకి రాబోతున్నట్లు అనౌన్స్ చేయడమే కాదు గ్రాండ్‌గా పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు.. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..