Site icon NTV Telugu

Viral Murder: తన నేరాన్ని దాచడానికి సొంత సోదరిని చంపిన కిరాతక అన్న..!

15

15

పాకిస్థాన్‌ లోని పంజాబ్ ప్రావిన్స్‌ లోని తోబా టేక్ సింగ్ నగరంలో ఒక అన్న తన సోదరిని వారి ఇంటిలో గొంతు కోసి హత్య చేశాడు. పరువు హత్యగా అనుమానిస్తున్న ఈ భయంకరమైన చర్య ఈ మర్చి నెల మొదట్లోనే జరగగా.. ఆ హత్య చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఫుటేజీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Sundaram Master OTT : ఓటీటీలోకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వైరల్ వీడియోలో.. చనిపోయిన మహిళ 22 ఏళ్ల మారియానుగా పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో వ్యక్తి తన చెల్లి గొంతు కోసి చంపడాన్ని చూడవచ్చు. బాధితురాలి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆ వ్యక్తి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపడం పూర్తి చేసిన వ్యక్తికి ఆమె తండ్రి నీటి సీసాని అందచేయటం కొసమెరుపు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.., మార్చి 17 లేదా 18వ తేదీ అర్ధరాత్రి ఈ నేరం జరిగిందని.. నేరస్థులు మహిళ మృతదేహాన్ని పాతిపెట్టారని తెలిపారు. మార్చి 24న ఈ నేరం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Also Read: Satyam Surana: ప్రధాని మోడీకి మద్దతు ఇచ్చినందుకే నన్ను అలా చేస్తున్నారు.. భారతీయ విద్యార్థి సత్యం సురానా..!

ఇంతటి ఘోరమైన నేరానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, ఈ వీడియోను చూసిన చాలా మంది ఈ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Exit mobile version