NTV Telugu Site icon

Viral: ఓరి బడవలరా.. ఇలా తయారయ్యారు ఏంటి.. స్కూల్ ఫంక్షన్ కు ఇలా వచ్చారేంట్రా..

Viral Video

Viral Video

Viral Video: ప్రస్తుత ప్రపంచంలో రోజుకొక కొత్త ట్రెండ్ పరిచయం అవుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు చదువులు నేర్పిస్తున్న పాఠశాలలో కూడా ట్రెండుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా మిగతా వాటిల్లో కూడా ప్రావిణ్యం పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా పాఠశాలలో ఏడాదికి ఒక రోజు ఏదో థీమ్స్ సంబంధించిన దుస్తులు ధరించి రమ్మని చెబుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రిటన్ పాఠశాలలో జరిగింది. అయితే ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి అందరూ మైమరిచిపోయే గెటప్ తో వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెళితే..

Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌కు భారత మహిళల ఆర్చరీ జట్టు..

బ్రిటన్ లోని లంకాషైర్‌లోని ఓస్వాల్డ్‌ట్విస్టల్‌ కు చెందిన లూకాస్ జేమ్‌సన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ ప్రాంక్ ను చేశారు. లూకాస్ తన ఇద్దరు స్నేహితులతో విడివిడిగా ఓ నల్లని శవ సంచిలో ఉండి పాఠశాలల్లోని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ బ్లూ కలర్ ఉన్న వ్యాన్ నుండి 3 నల్లని డెడ్ బాడీ బ్యాగులను ఇద్దరు వ్యక్తులు కిందకు దించుతారు. అలా మూడు బ్యాగులను కిందికి దించిన తర్వాత లూకాస్ తల్లి మొదట తన కొడుకు బ్యాగ్ ను ఓపెన్ చేయగా అందులోంచి అబ్బాయి బయటికి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా కొడుకు స్నేహితులను కూడా ఆ శవ బ్యాగ్ ల జిప్పులను తీయగా వారు కూడా బయటికి వచ్చారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Lalu Prasad: బీహార్ ప్రజలను నితీష్ కుమార్ మోసం చేశారు…

ఈ ఘటన చూసిన నెటిజన్స్.. ప్రస్తుత కాలంలో ఉన్న విద్యార్థులకు సృజనాత్మక ఎక్కువైందని., చదువు తక్కువ అయిందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. అసలు ఇలాంటి ఆలోచన చేయాలని మీకు ఎవరు ఐడియా ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు.

YouTube video player