Site icon NTV Telugu

Boy Rides Crocodile: అరెయ్ బుడ్డోడా.. అది గుర్రం అనుకున్నావా.. అలా చేస్తున్నావ్..

Untitled Design (2)

Untitled Design (2)

ఒక బాలుడు మొసలిపై స్వారీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో.. కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించబడినదని వాస్తవ తనిఖీదారులు నిర్ధారించారు.. బహుళ విశ్లేషణలు ఫుటేజ్ నకిలీదని నిర్ధారించాయి, కంటెంట్ AI వీడియో జనరేషన్ సాధనాల ద్వారా సృష్టించబడింది. తరచుగా తప్పుదారి పట్టించే లేదా తప్పుడు వాదనలతో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడుతుంది.

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన షాట్స్, రీల్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటే ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోనే ఇది కూడా. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరకు మొసలి రాగా దాన్ని చూసి భయపడాల్సిన ఈ చిచ్చర పిడుగు.. దాని మీద ఎక్కి స్వారీ చేశాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక దీన్నంతటిని చూసి అవాక్కైన పేరెంట్స్ కిందకు దిగాలని అరిచేలోపే.. పిల్లాడిని ఎత్తుకెళ్లింది మొసలి. ఆ తర్వాత అతను సర్వైవ్ అయ్యాడు. అయితే ఇది నిజం కాదని ఏఐ వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు. కొంచెం క్రియేటివిటీ ఎక్కువైందంటూ సెటైర్లు వేస్తున్నారు

Exit mobile version