NTV Telugu Site icon

Durga idol immersion: దుర్గా విగ్రహ నిమజ్జనంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి.. 30 మంది అరెస్టు

Uttar Pradesh

Uttar Pradesh

Durga idol immersion in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని మహసీ ప్రాంతంలో దుర్గా విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నాడు ఊరేగింపు ముస్లిం ప్రాంతం గుండా వెళుతుండగా ఇరువర్గాల మధ్య ఏదో అంశంపై వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం సంబంధించి బహ్రైచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వృందా శుక్లా మాట్లాడుతూ.. “మహ్సీలోని మహరాజ్‌గంజ్ ప్రాంతంలో ముస్లిం ప్రాంతం గుండా మసీదు సమీపంలో ఊరేగింపు జరుగుతోంది. అయితే ఆ సమయంలో కొన్ని విషయాలపై వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. హిందూ సమాజానికి చెందిన వ్యక్తిపై కాల్పులు జరిగాయి. ఫలితంగా ఆ వ్యక్తిమృతి చెందడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దాంతో వివిధ ప్రదేశాల్లో నిమజ్జనాన్ని నిలిపివేశారని, కొందరు దుష్టశక్తులు దీనిని సద్వినియోగం చేసుకొని అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారని తెలియచేసారు.

Mumbai Indians IPL 2025: ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ప్రధాన కోచ్‌గా మహేల జయవర్ధనే

మహరాజ్‌గంజ్‌లో జరిగిన ఈ ఘటనలో ఒక వ్యక్తిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 30 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. బహ్రైచ్‌ లోని మహసీ మహారాజ్‌గంజ్ ప్రాంతంలో దుర్గా విగ్రహం నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణ తర్వాత పోలీసులు రూట్ మార్చ్ కూడా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Aditynath) పరిస్థితిని గ్రహించి, బహ్రైచ్‌లో వాతావరణాన్ని పాడుచేసేవారిని విడిచిపెట్టబోమని తెలిపారు.

SpaceX: అద్భుతం.. ‘అంతరిక్షం’ నుంచి భూమిపై సురక్షితంగా దిగిన రాకెట్

Show comments