Guinness World Record: గిన్నిస్ రికార్డుల సంఖ్య.. సచిన్‌ను అధిగమించిన ఢిల్లీ వాసి!
- 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు
- సచిన్‌ను అధిగమించిన వినోద్ కుమార్
- సచిన్‌కు పెద్ద అభిమానిని అంటున్న వినోద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మాజీ జేఎన్‌యూ ఉద్యోగి, కంప్యూటర్ ట్రైనర్ వినోద్ కుమార్ చౌధరి (43) అధిగమించారు. గిన్నిస్ రికార్డుల సంఖ్యలో సచిన్‌ను వినోద్ చౌధరి వెనక్కి నెట్టారు. ఢిల్లీకి చెందిన వినోద్.. టైపింగ్‌లో ఏకంగా 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో 19 గిన్నిస్ రికార్డులను కలిగి ఉన్న సచిన్‌ను అతడు దాటేశారు.
ఢిల్లీలోని కిరారి సులేమాన్ నగర్ గ్రామంలో వినోద్ కుమార్ చౌధరి నివాసం ఉంటున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని అత్యంత వేగంగా టైపింగ్ చేయడం, నోటి పుల్ల (మౌత్ స్టిక్)తో టైపింగ్ చేయడం, ఆంగ్ల వర్ణమాలను ముక్కుతో వేగంగా టైప్ చేయడం వంటి వాటికి ప్రసిద్ధి చెందారు. ఇప్పటికే 19 గిన్నిస్ రికార్డులతో సచిన్‌ను సమం చేశారు. తాజాగా కళ్లకు గంతలు కట్టుకుని అంగ్ల అక్షరాలను కేవలం ఐదు సెకన్లలో జెడ్ నుంచి ఏ వరకూ (వెనక్కు) టైపింగ్ చేసి రికార్డు సృష్టించాడు. దాంతో క్రికెట్ దిగ్గజంను అధిగమించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: Cristiano Ronaldo: ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన రొనాల్డో.. మైదానంలో మాత్రం కాదు!
సచిన్ టెండూల్కర్‌కు తాను పెద్ద అభిమానిని అని, క్రికెట్ దిగ్గజం చేతుల మీదుగా 20వ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను అందుకోవాలనుకుంటున్నా అని వినోద్ కుమార్ చౌధరి తెలిపారు. ‘నేను సచిన్ టెండూల్కర్‌ని చూస్తూ పెరిగాను. సచిన్ లాగా నా దేశం గర్వపడేలా చేయాలనుకుంటున్నా. ఓ భారతీయుడు తన రికార్డును అధిగమించినందుకు సచిన్ ఖచ్చితంగా గర్వపడతాడని నేను అనుకుంటున్నా’ అని వినోద్ చెప్పుకొచ్చారు. వినోద్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ను రన్ చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఆయన శిక్షణ ఇస్తుంటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!