NTV Telugu Site icon

Guinness World Record: గిన్నిస్‌ రికార్డుల సంఖ్య.. సచిన్‌ను అధిగమించిన ఢిల్లీ వాసి!

Sachin Ec

Sachin Ec

క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను మాజీ జేఎన్‌యూ ఉద్యోగి, కంప్యూటర్‌ ట్రైనర్ వినోద్‌ కుమార్‌ చౌధరి (43) అధిగమించారు. గిన్నిస్‌ రికార్డుల సంఖ్యలో సచిన్‌ను వినోద్‌ చౌధరి వెనక్కి నెట్టారు. ఢిల్లీకి చెందిన వినోద్‌.. టైపింగ్‌లో ఏకంగా 20 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో 19 గిన్నిస్‌ రికార్డులను కలిగి ఉన్న సచిన్‌ను అతడు దాటేశారు.

ఢిల్లీలోని కిరారి సులేమాన్ నగర్ గ్రామంలో వినోద్‌ కుమార్‌ చౌధరి నివాసం ఉంటున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని అత్యంత వేగంగా టైపింగ్‌ చేయడం, నోటి పుల్ల (మౌత్‌ స్టిక్‌)తో టైపింగ్ చేయడం, ఆంగ్ల వర్ణమాలను ముక్కుతో వేగంగా టైప్‌ చేయడం వంటి వాటికి ప్రసిద్ధి చెందారు. ఇప్పటికే 19 గిన్నిస్‌ రికార్డులతో సచిన్‌ను సమం చేశారు. తాజాగా కళ్లకు గంతలు కట్టుకుని అంగ్ల అక్షరాలను కేవలం ఐదు సెకన్లలో జెడ్‌ నుంచి ఏ వరకూ (వెనక్కు) టైపింగ్‌ చేసి రికార్డు సృష్టించాడు. దాంతో క్రికెట్ దిగ్గజంను అధిగమించారు.

Also Read: Cristiano Ronaldo: ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన రొనాల్డో.. మైదానంలో మాత్రం కాదు!

సచిన్‌ టెండూల్కర్‌కు తాను పెద్ద అభిమానిని అని, క్రికెట్ దిగ్గజం చేతుల మీదుగా 20వ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను అందుకోవాలనుకుంటున్నా అని వినోద్‌ కుమార్‌ చౌధరి తెలిపారు. ‘నేను సచిన్ టెండూల్కర్‌ని చూస్తూ పెరిగాను. సచిన్ లాగా నా దేశం గర్వపడేలా చేయాలనుకుంటున్నా. ఓ భారతీయుడు తన రికార్డును అధిగమించినందుకు సచిన్ ఖచ్చితంగా గర్వపడతాడని నేను అనుకుంటున్నా’ అని వినోద్‌ చెప్పుకొచ్చారు. వినోద్‌ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌ను రన్ చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఆయన శిక్షణ ఇస్తుంటారు.

Show comments