వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు ఒక అడుగు దూరంలో పోయింది. ఫైనల్‌కు ముందు 100 గ్రాములు ఎక్కువ బరువు కలిగి ఉండటం వల్ల ఆమెపై అనర్హత వేటు వేశారు. దీంతో.. వినేశ్ ఫైనల్ ఆడలేకపోయింది. ఫైనల్ కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. బరువు తగ్గేందు కోసం రక్తం తీశారు. జుట్టు కత్తిరించారు. చాలా గంటలు వ్యాయామం చేసింది. అయినప్పటికీ.. 100 గ్రాములు ఎక్కువగానే ఉంది. దీంతో.. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే తన కల చెదిరిపోయిన తర్వాత వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించింది.
Read Also: Medical Alert: పేషెంట్లకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా 24 గంటలు వైద్య సేవలు బంద్
అయితే.. తాజాగా వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై శుభవార్త చెప్పింది. తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రెజ్లింగ్‌లో పునరాగమనం చేయబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చింది. 2032 వరకు ఆడాలనుకున్నట్లు వినేశ్ చెప్పింది. వినేష్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో “నా టీమ్‌కి, నా తోటి భారతీయులకు మరియు నా కుటుంబానికి, మేము పని చేస్తున్న, సాధించాలనుకున్న లక్ష్యం అసంపూర్తిగా మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. ఎప్పుటికీ ఇలా జరగదు. అన్ని విషయాలు ఎప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు. నేను 2032 వరకు ఆడగలుగుతాను, నాలో పోరాటం, కుస్తీ ఎప్పుడూ ఉంటుంది.” అని పోస్ట్ లో పేర్కొంది.
Read Also: Vinesh Phogat: చనిపోతుందేమోనని భయపడ్డాం.. వినేశ్ ఫోగట్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
