Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaysai Reddy About New Party: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రావణమాసం పూర్తయిన తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కొత్త రాజకీయ పార్టీపై మాజీ ఎంపీ చేసిన తాజా ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తి నెలకొంది.
కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ కేంద్రంగా కొనసాగిస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. త్వరలో విజయవాడలో నిర్వహించనున్న సమావేశంలో పార్టీ పేరు, విధివిధానాలు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా ముందు వెల్లడించనున్నట్లు తెలిపారు. విజయవాడ సమావేశం అనంతరం తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, వారి సమస్యలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు.
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు భిన్నంగా తమ కొత్త పార్టీ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం తమ పార్టీ ప్రధాన అజెండాగా ఉంటాయని చెప్పారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేసే రాజకీయ వేదికను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతాల వారీగా ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం పార్టీ నిర్మాణం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!