Site icon NTV Telugu

Vande Bharat Train: విజయవాడ నుంచీ చెన్నైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. వర్చువల్ గా ప్రారంభించనున్న మోడీ

Vande Barth

Vande Barth

విజయవాడ-చెన్నై నగరాల మధ్య వందేభారత్ రైలును ఇవాళ ( ఆదివారం ) ఉదయం 10.30 గంటలకు జెండా ఊపి ప్రధాన మంత్రి నరంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 8 బోగీల ఈ రైలు వారంలో ఆరు రోజులు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. ఒక్క మంగళవారం రోజు మాత్రం ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు.. నేడు లాంఛనంగా వందేభారత్ రైలును ప్రారంభించినప్పటికీ.. రేపటి (సెప్టెంబర్ 25) నుంచి ఈ ట్రైన్ సేవలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. వందేభారత్ ఎక్స్ ప్రెస్ విజయవాడ నుంచి చెన్నైకి 6 గంటల 40 నిమిషాల్లోనే చేరుకుంటుంది. విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు స్టార్ట్ అయ్యి.. రాత్రి 10 గంటలకు చెన్నైకి చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల్లో దీనికి స్టాప్‌లు ఉన్నాయి. 3.49 గంటలకు తెనాలి చేరుకునే ఈ రైలు.. సాయంత్రం 5.03 గంటలకు ఒంగోలు.. సాయంత్రం 6.19కి నెల్లూరు, రాత్రి 8.05 గంటలకు రేణిగుంట చేరుకోనుంది.

Read Also: TS Heavy Rain: తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. హైదరాబాద్‌లో జల్లులు కురిసే అవకాశం

ఇక, చెన్నైలో ఉదయం 5.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకోనుంది. ఉదయం 7.05 గంటలకు రేణిగుంట, 8.39 గంటలకు నెల్లూరు, 10.09 గంటలకు ఒంగోలు, 11.21 గంటలకు తెనాలి చేరుకుంటుంది. అయితే, విజయవాడ నుంచి చెన్నైకి చైర్ కార్ ధర రూ.1420 కాగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2,690గా నిర్ణయించారు. తిరుగు ప్రయాణంలో టికెట్ల ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు ఏసీ చైర్ కార్ రూ.1320 కాగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ 2540 రూపాయలుగా ఉంటుంది. క్యాటరింగ్ ఛార్జీలు లేకుంటే ఈ టికెట్ల ధరలు ఇంకా తక్కువగా ఉంటాయి. విజయవాడ నుంచి రేణిగుంట వరకు చైర్ కార్ టికెట్ రూ.1175 ఉండగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.2110గా ఉండనుంది. తిరుగు ప్రయాణంలో ఈ రూ.1075, రూ.2020గా ఉన్నాయి.

Read Also: Tea: లేచిన వెంటనే టీ తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి

ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య విజయవాడ మీదుగా వందేభారత్ రైలు నడుస్తుంది. ఇప్పుడు చెన్నై రూట్లో మరో రైలు రావడంతో.. విజయవాడవాసులకు రెండో వందే భారత్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్ రైలును రెండు నెలల క్రితమే స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ టెక్నికల్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తోన్న వందేభారత్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతికి వెళ్తుంది. ఇప్పుడు కొత్త వందేభారత్ రైలుతో ఒంగోలు, నెల్లూరు వాసులకు సైతం రెండు వందేభారత్ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Exit mobile version