విజయవాడ రైల్వే స్టేషన్ అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశ వ్యాప్తంగా పేరుగాంచిన రైల్వే స్టేషన్. లక్షలాదిమంది ప్రయాణికులను గమ్య మార్గాలకు చేర్చడంలో, సరుకు రవాణాలో తిరుగులేని చిహ్నంగా ఎన్నో మైలురాళ్ళను అధిగమిస్తూ 94వ వసంతంలో అడుగు పెట్టటమే కాకుండా ఏ1 హోదాకు అర్హత పొందింది. దేశ వ్యాప్తంగా రెండవ అతిపెద్ద రైల్వే జంక్షన్ బెజవాడ. మొదట్లో చిన్న షెడ్డులో ఏర్పడింది. ప్రస్తుతం వున్న రైల్వే స్టేషన్ 1979లో ఏర్పడింది. ఇది మొత్తం పది ప్లాట్ ఫామ్ లతో కూడిన అతిపెద్ద జంక్షన్. విజయవాడ మీదుగా నిత్యం 400 పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ వుంటాయి.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనే ఈ విజయవాడ రైల్వే స్టేషన్ ను ఏడు సార్లు జాతిపిత మహాత్మా గాంధీ సందర్శించారు. సదరన్ రైల్వే పరిధిలో విజయవాడ రైల్వే డివిజన్ 1966లో ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే అవిర్బాగంలో భాగంగా ఈ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకంగా ఈ స్టేషన్ వుంది. దేశంలోనే భారీ ఆదాయాన్ని ఇచ్చి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. డివిజన్ పరిధిలో 156 రైల్వేస్టేషన్ లు వున్నాయి. చెన్నై – న్యూ ఢిల్లీ, నార్త్-సౌత్ రూట్, చెన్నై -హౌరా ఈస్ట్- కోస్ట్ రూట్ ల వల్ల ఇది ట్రై జంక్షన్ గా మారింది. ఈ రైల్ రూట్లు విజయవాడ పరిధిలో గుంటూరు/ గుంతకల్, మచిలీపట్నం/నర్సాపురం మీదుగా వెళ్తాయి. అంతేకాకుండా కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు దీని పరిధిలోకి వస్తాయి
దేశవ్యాప్తంగా విజయవాడ రైల్వే స్టేషన్ అంటే తెలియని వారు ఉండరు. నిత్యం వేలాదిమందిని వారి గమ్య స్థానాలకు చేర్చడంతో పాటు, సరుకు రవాణాలోను విజయవాడ రైల్వే స్టేషన్ చేరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ 94వ వసంతంలోకి అడుగులు వేసింది.75 సంవత్సరాల స్వాతంత్ర్య మహోత్సవాలు, ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక అయిన 75 రైల్వే స్టేషన్ లలో A1 హోదా పొందింది విజయవాడ రైల్వే స్టేషన్. నిత్యం వేల మంది ఈ స్టేషన్ నుంచి ప్రయాణాలు చేస్తూ వుంటారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ 94వ వసంతలోకి అడుగు పెడుతూ… తన వేగాన్ని పెంచుకుంటూ A1 కీర్తిని గడించింది ఈ రైల్వే స్టేషన్.
బోనం అంటే ఏంటి..? అందులో ఏం ఉంటుంది..?