బోనం అంటే ఏంటి..? అందులో ఏం ఉంటుంది..?

ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ వంటి గ్రామ దేవతలను పూజించడమే బోనాలు పండుగ ప్రత్యేకత

బోనం అంటే భోజనం.. భోజనం కలిగిన కుండను అమ్మకు నైవేద్యంగా సమర్పించడమే బోనం

 అమ్మకు నచ్చిన వంటకాలు  చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఉల్లిపాయలు కలిపిన అన్నం వండి మహిళలు బోనం కడతారు.

బోనం చుట్టూ పసుపు రాసి వేపాకులు కట్టి దానిపై జ్యోతిని వెలిగిస్తారు.

అలా కట్టిన బోనాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారి ముందు పెడతారు

బోనం ఎత్తడం వలన దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల విశ్వాసం

పోతురాజు అమ్మవారికి సోదరుడిగా భావిస్తారు.. పోతురాజు తోడుగా ఉంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని భక్తుల నమ్మకం

దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో మేకలను, కోళ్లను బలి ఇస్తారు

ఇంటి ఆడపడుచులు బోనం ఎత్తితే కుటుంబానికి మంచిదని భక్తుల నమ్మకం

తెలంగాణ సంస్కృతిని పెంచే అతిపెద్ద పండుగ లష్కర్ బోనాలు