Site icon NTV Telugu

Kesineni Nani: బెజవాడ అభివృద్ధి కోసం ముళ్ల పందితోనైనా కలుస్తా.. ఎంపీ టికెట్‌ ఇవ్వకపోతే..!

Nani

Nani

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నిన్నటికి నిన్న పార్టీ శ్రేణులకు షాకిస్తూ వైసీపీ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఈ రోజు కీలక కామెంట్లు చేశారు.. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు.. రాజకీయాల్లో నేను, నా కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదు.. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని నేను అభినందిస్తానని తెలిపారు.. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ నాలుగేళ్లుగా నాకు తెలుసు.. వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.. నాకు తెలిసి మొండి తోక బ్రదర్స్ మంచి వాళ్లు అని పేర్కొన్నారు.. ఇసుకలో వాటాలు, మైనింగ్ లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నేను చేయనన్న నాని.. బెజవాడ పార్లమెంట్ కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తా అన్నారు.

Read Also: Big Breaking: శరత్ బాబు కన్నుమూత!

తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతా అని కేసీఆర్‌ అన్నారు.. నేను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ల పందితో అయినా కలుస్తాను అంటూ వ్యాఖ్యానించారు కేశినేని నాని.. ఎంపీగా ఉన్న నేను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలి.. వైసీపీ లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయ భాను , మొండితోక సమన్వయం చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నాను అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలతో సిద్ధాంత పరమైన ఫైట్ ఉంటుంది.. కానీ, బెజవాడ అభివృద్ధి కోసం ఎవరితో అయినా నేను కలిసి పనిచేస్తానని ప్రకటించారు. నేను ఢిల్లీ మనిషిని.. నేను ఎంపీగా ఉన్నా లేకపోయినా నాకు ఉన్న పరిచయాలతో బెజవాడ ప్రజలకు సేవ చేస్తా అన్నారు. నేను ఏమన్నా మాట్లాడితే పార్టీ మారుతున్నా అని ప్రచారం చేస్తున్నారు.. నా వల్ల టీడీపీకి నాలుగు ఓట్లు పడాలి అనే పనులే చేస్తాను అని స్పష్టం చేశారు. ఇక, గడ్కరీ, చంద్రబాబుకి నేను శిష్యుడిని అని వెల్లడించిన ఆయన.. వెనుక బడిన బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసమే పని చేస్తాను.. నా శ్వాస, నా ఊపిరి అన్నీ బెజవాడ పార్లమెంట్ కోసమే ఉంటుందని వ్యాఖ్యానించారు ఎంపీ కేశినేని నాని.

Exit mobile version