Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో విదేశాల్లో ఉద్యోగాల వీసాల పేరుతో నిరుద్యోగులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికిన కేటుగాళ్లు, నిరుద్యోగుల నుంచి విడతల వారీగా సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని అమృత హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ప్లేస్మెంట్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో నరేష్ కుమార్‌తో వారికి పరిచయం ఏర్పడింది. అదే ఇనిస్టిట్యూట్‌లో చదువుకున్న రోజుల్లో నరేష్ కుమార్ చెప్పిన మాయమాటలను నమ్మి బాధితులు పూర్తిగా మోసపోయారు. ప్రస్తుతం నిందితుడు నరేష్ కుమార్ లయోలా కళాశాలలో పనిచేస్తున్నట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుద్యోగుల ఉపాధి అవకాశాలను ఆసరాగా చేసుకుని నరేష్ కుమార్‌తో పాటు మరికొందరు కేటుగాళ్లు కలిసి ఎనిమిది మంది నుంచి విడతల వారీగా రూ. 50 లక్షలు వసూలు చేశారు.
Also Read
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
చెన్నైకి చెందిన అరుణ్ కుమార్, ఉదయ్ కుమార్, సెంథిల్ కుమార్ తదితరుల బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లు బాధితులు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. డబ్బులు వసూలు చేయడమే కాకుండా.. బాధితుల ఒరిజినల్ పాస్‌పోర్టులను కూడా బలవంతంగా తీసుకుని, వాటిని వెనక్కి ఇవ్వకుండా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు వాపోయారు.
ఉద్యోగాల కోసం తాము కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయలను కోల్పోవడమే కాకుండా.. పాస్‌పోర్టులు కూడా చేతిలో లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులను, పాస్‌పోర్టులను ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు విజయవాడ సీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను చట్టపరంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!