NTV Telugu Site icon

Vijayawada: 3 రోజులపాటు దుర్గగుడి ఘాట్‌రోడ్ మూసివేత

Indrakeeladri Min

Indrakeeladri Min

Vijayawada: విజయవాడలోని ప్రముఖ క్షేత్రమైన ఇంద్రీకీలాద్రి ఆలయం వైపు వెళ్లే ఘాట్‌ రోడ్డును 3 రోజుల పాటు మూసివేశారు. ఇవాళ్టి సాయంత్రం నుంచి ఈ నెల 22 వరకు ఘాట్‌రోడ్డును మూసి ఉంచనున్నారు. కొండరక్షణ చర్యల పనుల్లో భాగంగా ఘాట్‌రోడ్ రాకపోకలపై ఆంక్షలు విధించారు. కనకదుర్గానగర్ మీదుగా భక్తులు, వీవీఐపీలు, సిబ్బంది రావాలని ఈవో విజ్ఞప్తి చేశారు. వినాయకగుడి, స్నానాల రేవు నుంచి కనకదుర్గానగర్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

Read Also: Health: ఈ కూరగాయలు తింటే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.. మీరు తింటున్నారా..?

Show comments