Site icon NTV Telugu

Vijayawada Double Murder: బెజవాడ వీధుల్లో వీరవిహారం.. ఇద్దరు యువకులను కిరాతకంగా హత్య చేసిన రౌడీ షీటర్..!

Vijayawada Double Murder

Vijayawada Double Murder

Vijayawada Double Murder: విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఇద్దరు యువకులను ఒక రౌడీ షీటర్ అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. నగరం నడిబొడ్డున గవర్నర్‌పేటలో జరిగిన ఈ జంట హత్యలతో నగరం ఉలిక్కిపడింది. నిందితుడిని రౌడీ షీటర్ జమ్ముల కిషోర్‌గా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. నిత్యం గంజాయి బ్యాచ్‌లు, బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీ షీటర్లు.. బెజవాడ వీధుల్లో వీరవిహారం సృష్టిస్తున్నారు.

CM Relief Fund Scam: సెక్రటేరియట్‌లో దొంగలు.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులే హామ్ ఫట్..!

తాజాగా బెజవాడ గవర్నర్‌పేటలో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఒకేసారి ఇద్దరు వ్యక్తులను చంపేసి పారిపోయాడు. అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా ఉన్న సందులో ఈ దారుణం జరిగింది. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. యువకులను ఎవరో హత్య చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ కత్తి పొట్లతో రక్తపు మడుగులో ఇద్దరు యువకులు పడి ఉన్నారు. మృతి చెందిన వారిని విజయవాడకి చెందిన రాజు, విశాఖపట్నానికి చెందిన వెంకట రావుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు క్యాటరింగ్ పని చేస్తున్నట్టు చెబుతున్నారు.

AI Video: వాస్తవాన్ని తలపించే నకిలీ వీడియో.. వీడియో వైరల్..!

ఈ జంట హత్య కేసులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు షురూ చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో ఈ ఇద్దరు యువకులను జమ్ము కిశోర్ అనే రౌడీ షీటర్ హత్య చేసినట్టుగా సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. హత్య చేసిన తర్వాత కిషోర్ పరారైనట్టు CC కెమెరాల్లో రికార్డయింది. మద్యం మత్తులో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఏంటి అనే విషయాలు విచారిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కిషోర్‌ను పట్టుకోవడం కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కిషోర్‌పై ఇప్పటికే 8 కేసులు ఉండగా అందులో ఒక హత్య కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కిషోర్‌ను అరెస్ట్ చేస్తే.. జంట హత్యలకు అసలు రీజన్ ఏంటనే విషయం బయట పడుతుందంటున్నారు పోలీసులు.

Exit mobile version