NTV Telugu Site icon

Attack on CM Jagan Incident: కొంత మందిపై అనుమానం ఉంది.. అక్కడి నుంచే రాయి విసిరారు..

Vja Cp

Vja Cp

Attack on CM Jagan Incident: సీఎం వైఎస్‌ జగన్‌పై రాయి దాడి ఘటనలో కీలక విషయాలు ప్రస్తావించారు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా తాతా.. బెజవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బెజవాడ పరిధిలో 22 కిలో మీటర్ల జగన్ రోడ్ షో చేశారు. 1,480 సిబ్బంది జగన్ రోడ్ షోలో బందోబస్తు కోసం పాల్గొన్నారు. 400 మందితో 40 రోప్ పార్టీలు పెట్టాయి. ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్లు వచ్చాయి. ఇదే కాకుండా సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది.. అక్టోపస్ భద్రతా ఉంది. జనసమ్మర్థమైన ప్రాంతాల్లో రోడ్ షో జరిగింది. రకరకాల కేబుల్స్ అడ్డంకిగా ఉన్నాయి. దీంతో కొన్ని తొలగించాల్సి వచ్చిందన్నారు.. బస్ రూఫ్ మీద ఎక్కుతారు కాబట్టి.. పవర్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఏ వీఐపీ కార్యక్రమమైనా.. రూఫ్ ఎక్కితే పవర్ ఆపాల్సిందే అన్నారు. అయితే, వివేకానంద స్కూల్ – గంగానమ్మ గుడి ప్రాంతానికి చేరుకున్న సందర్భంలో ఓ వ్యక్తి రాయి విసిరాడు అని వెల్లడించారు.

Read Also: Chandrababu: రాష్ట్రానికి నేనే డ్రైవర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక, సీసీ కెమెరాల నుంచి.. సెల్ ఫోన్ విజువల్స్ నుంచి మేం సేకరించిన సమాచారం మేరకి రాయి విసిరారని నిర్ధారణకు వచ్చామని తెలిపారు సీపీ కాంతా రాణా.. సీసీ టీవీ ఫుటేజ్, విజువల్స్ ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపాం అన్నారు. సీఎంపై దాడి ఘటనలో ఎనిమిది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపడుతున్నాం అన్నారు. ఇప్పటికే 52 మందిని ప్రశ్నించాం.. కొంత మందిపై అనుమానం ఉందన్నారు. అయితే, చీకట్లో రాయి విసిరిన వ్యక్తిని కనుక్కోవడం ఈజీ టాస్క్ కాదు. కానీ, త్వరలో కనుగొనే ప్రయత్నం చేస్తాం అన్నారు. స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నించొనే రాయి విసిరారు.. కంప్లైంటును బేస్ చేసుకుని.. కేసు సీరియస్ నెస్ ను దృష్టిలో పెట్టుకునే హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Read Also: Mamata Banerjee: బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలు ఉండవు..

సీఎం జగన్‌కు తగలరాని చోట తగిలితే పెద్ద ప్రమాదమే జరిగేదన్నారు విజయవాడ సీపీ.. సీఎం జగన్‌పై దాడి చేసిన నిందితులను పట్టుకొవడంలో ప్రజలు దోహదపడాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితమైన సమాచారాన్ని దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చు అన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారం ఇవ్వొచ్చు అని సూచించారు. కేసుకు దోహదపడే సమాచారం అందించిన వారికి రూ. 2 లక్షల నగదును బహుమతి ఇస్తాం అని ప్రకటించారు. సమాచారాన్ని అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా తాతా..