NTV Telugu Site icon

YS Jagan Stone Pelting Case: సీఎం జగన్‌పై రాయిదాడి కేసు.. నిందితుడు సతీష్‌ కస్టడీకి కోర్టు అనుమతి

High Court

High Court

YS Jagan Stone Pelting Case: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. సీఎం జగన్‌పై దాడి కేసులో సతీష్‌ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వకేట్‌ సమక్షంలో పోలీస్ విచారణ జరగాలని కోర్టు విచారించాలని స్పష్టం చేసింది. సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో సతీష్ ఏ1గా ఉన్నాడు. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. మూడు రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గురువారం నుంచి శనివారం వరకు నిందితుడిని పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం విజయవాడ సబ్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. గురువారం ఉదయం 10 గంటల నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

Read Also: Fire Accident : బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో మంటలు.. మూగబోయిన తొమ్మిది లక్షల ఫోన్లు