Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada CI Ali Death Case: విజయవాడలో సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ అనుమానాస్పద, అసహజ స్థితిలో మృతి చెందినట్లు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన నిరసన సమయంలో సీఐ అలీని వారు నెట్టుకుంటూ వెళ్లడంతో ఆయన కిందపడిపోయారని పేర్కొన్నారు. కిందపడిన అనంతరం అలీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని కానిస్టేబుల్ తన ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత అలీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు కానిస్టేబుల్ సుధాకర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులు, అలీ మృతికి దారితీసిన కారణాలపై సత్యనారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు..
కాగా, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు బెజవాడలో నిర్వహించిన ఆందోళనల్లో విషాద ఘటన చోటు చేసుకున్న విషయం విదితమే.. విధుల్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అహ్మద్ అలీ (54) గుండెపోటుతో మరణించారు.. ఆందోళన నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా.. ధర్నాచౌక్, అలంకార్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న అలీకి గుండెలో స్వల్ప నొప్పి రాగా.. వెంటనే సూర్యారావుపేటలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు.. అయితే, కాసేపటి తర్వాత బాగానే ఉందంటూ మళ్లీ బందోబస్తుకు వచ్చారు.. కానీ, అలంకార్ సెంటర్లో నిలబడిన 10 నిమిషాలకు మళ్లీ అస్వస్థతకు గురుకావడం.. ఆ వెంటనే జీపులో మరో ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన స్పృహ కోల్పోయారు. ఇక, మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్‌కు తరలించారు. సీపీఆర్ చేసినా శరీరంలో కదలిక లేకపోవడంతో.. అలీ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.. అయితే, ఇప్పుడు కానిస్టేబుల్ సుధాకర్ ఫిర్యాదుతో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది..
Also Read
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
తాజావార్తలు
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!