Site icon NTV Telugu

Vijayawada: భవానిపురంలో కారు బీభత్సం.. నిందితులు అరెస్ట్, పరారీలో మరోకారు..!

Arrest

Arrest

Vijayawada: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానిపురం బేరం పార్క్ సమీపంలో జరిగిన కారు బీభత్సం ఘటనపై పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన వెంటనే భవానిపురం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్ర గాలింపు చేపట్టారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

Snake Bite: ‘నన్ను పాము కరిచింది..’ అంటూ వేసుకున్న జాకెట్ తెరిచి..!

ఈ ఘటనకు సంబంధించి ఏడీసీపీ రామకృష్ణ కీలక వివరాలు వెల్లడించారు. కరుడు కట్టిన పాత నేరస్తులు, రౌడీషీటర్లైన కొండా యోహావా అలియాస్ పెద్ద చిచ్చా, కొండా రమేష్ అలియాస్ చిన్న చిచ్చా, వీర్ల భార్గవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జక్కుల దినేష్ అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు.

నిందితుల నేర చరిత్రను పరిశీలిస్తే పెద్ద చిచ్చాపై మొత్తం 18 కేసులు, చిన్న చిచ్చాపై ఏకంగా 42 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్న చిచ్చా గతంలో పది నెలల పాటు జైలు శిక్షను కూడా అనుభవించినట్లు తెలిపారు. వీరి నేర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీసీపీ స్పష్టం చేశారు.

Mobile Charging Tips: దిండ్లు, దిప్పట్లపై మొబైల్‌ను పెడుతున్నారా?.. డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!

ఈ ప్రమాదంలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడగా, మరికొందరు స్వల్ప గాయాల పాలయ్యారు. ర్యాష్ డ్రైవింగ్‌కు ఉపయోగించిన కారు రిపేర్ నిమిత్తం వచ్చినదే అయినప్పటికీ, నిందితులు దానిని జల్సాల కోసం వాడినట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. భవానిపురం ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

Exit mobile version