NTV Telugu Site icon

Vijayasai Reddy: రాజ్యసభ తొలి సమావేశం జరిగిన చారిత్రక దినం

Vijayasai Reddy On Babu

Vijayasai Reddy On Babu

మే 13కు ప్రత్యేకరోజు పేర్కొనవచ్చు. ఎందుకంటే.. ఈ రోజున రాజ్యసభ తొలి సమావేశం జరిగింది. ఈ విషయాన్నే గుర్తు చేస్తే వైసీపీఎం విజయసాయిరెడ్డి.. ‘1952 మే 13…రాజ్యసభ తొలి సమావేశం జరిగిన చారిత్రక దినం. ప్రజాతీర్పుతో ఏర్పడిన లోక్ సభ తొందరపాటుతో చట్టాలు చేయకుండా నిరోధించడానికి రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఏర్పడింది ఎగువసభ. వివిధ రంగాల్లో నిష్ణాతులైన సభ్యుల అమూల్యమైన సలహాలు, ప్రగతిశీల చర్చలతో దేశ సేవలో నిమగ్నమైంది రాజ్యసభ.’ అంటూ ట్వీట్‌ చేశారు.

అయితే.. మే 13న చరిత్రాత్మకమైన రోజున మొదటి సభ జరిగిన.. భారత పార్లమెంటులో ‘రెండవ గది’ గా పేరొందిన ఈ హాల్‌కు 1954 ఆగస్టు 23న రాజ్యసభగా పేరు పెట్టబడింది. 1952 నుంచి 1962 వరకు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. కాబట్టి సహజంగానే రాజ్యసభ చైర్మన్ గా ఆయన 10 సంవత్సరాల పాటు ఉన్నారు. కాబట్టి రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో మొదటి రాజ్యసభ సమావేశాలకు ఛైర్మన్ గా నాటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. 1952 మే 13 ఎగువ సభ గురించి ఆయన ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటైన ‘రాష్ట్రాల మండలి’ (ప్రస్తుతం రాజ్యసభ) మొదటిసారిగా కలిసి కూర్చున్న ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని సర్వేపల్లి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. దీనికి గర్వంగా సంతోషంగా ఉందన్నారు. అయితే.. ఈ నేపథ్యంలో ఈ చారిత్రాత్మక దినాన్ని గుర్తు చేసుకుంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఆసక్తికర ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.