Vijay Sai Reddy: తాను జగన్‌కు ఎప్పుడూ నమ్మకద్రోహం చేయలేదని.. నమ్మకద్రోహమే తన రక్తంలో ఉంటే ఎప్పుడో పార్టీ మారిపోయేవాడిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ కోటరీ తనను నమ్మకద్రోహి అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తోందంటూ మాజీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు బహిరంగ లేఖ విడుదల చేశారు. జగన్ కి నమ్మకస్తుడిననే కారణంతోనే అనేక కేసుల్లో తనను నిందితుడిగా చేర్చారని చెప్పుకొచ్చారు. 2020 తర్వాత తనపై పార్టీలో క్రమంగా కుట్రలు, అవమానాలు పెరిగాయని.. తనను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు కోర్ కమిటీ నుంచి కూడా తొలగించారని గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడూ కోటరీలో లేనని.. జగన్ దృష్టిలో తన మాటకు ఉన్న విలువను 2020 నుంచి అంచెలంచెలుగా తగ్గించింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ఆరోపించారు..
మంత్రులకు సైతం జగన్‌ను కలవకుండా అడ్డుకున్నది సజ్జలే అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. “పార్టీ లోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు సజ్జల ఆధ్వర్యంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు జరిగిన అవమానాలు మొత్తం 74 ఉన్నాయి.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పనిచేయలేక రాజ్యసభ పదవిని వదులుకున్నా. కోటరీ కారణంగానే వైసీపీ నుంచి బయటకు వచ్చా. ఇప్పుడు వైసీపీలో నంబర్-2 జగన్.. నంబర్-1 సజ్జల. సజ్జలకు తలవంచి పనిచేయడం నావల్ల కాదు. జగన్‌కు నేను నమ్మకద్రోహం చేయలేదు.. చేయబోను. వైసీపీలో ఎవరు కోవర్టులో.. ఎవరు నమ్మకద్రోహులో కార్యకర్తలు ఆలోచించుకోవాలి. నేను పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు వేరే పార్టీ పెడుతున్నాను. మరో సందర్భంలో మరిన్ని నిజాలు మీడియా ద్వారా వెల్లడిస్తా.” అని స్పష్టం చేశారు.
విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ…@TV9Telugu @NtvTeluguLive @tv5telugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @ANI @PTI_News @timesofindia @htTweets @eenadulivenews @ANDHRAJYOTI @SakshiNews @the_hindu @IndianExpress @NewIndianXpress… pic.twitter.com/J8WQhm4QuN
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 29, 2026

