Site icon NTV Telugu

MP Vijayasai Reddy : టీడీపీ హయాంలో జరిగిన అప్పులు జనం మర్చిపోలేదు

Vijayasai Reddy

Vijayasai Reddy

ప్రధాని మోడీ విశాఖ పర్యటనలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ శంఖుస్థాపన కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. ప్రధాని కార్యాలయం కు సీఎంఓ నుంచి లేఖ పంపించినట్టు ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసారెడ్డి… వై వి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ప్రధాని సభకు రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని సాయిరెడ్డి చెప్పారు. ఇక, మాజీ ఆర్థిక మంత్రికి రాజకీయ విమర్శలు చెయ్యడం అలవాటుగా మారిందని మండిపడ్డారు సాయిరెడ్డి. అసలు ఆయన హయాంలో ఎంత అప్పులు చేశారు ఇప్పుడు ఎంత అప్పు జరిగిందో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : Koti Deepotsavam 6th Day Live : సింహాద్రి అప్పన్నకు మహానీరాజనం.. శ్రీ వరాహ లక్ష్మీనరసింహుని కల్యాణం..
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ వన్ .. ఆ ర్యాంకింగ్ ను చెత్తబుట్టలో పడేయడం అన్నమాట సరికాదన్నారు సాయిరెడ్డి. టిడిపి హయాంలో జరిగిన అప్పులు జనం మర్చిపోలేదని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 12న ప్రధాని మోడీ తెలంగాణలో సైతం పర్యటించనున్నారు. రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. అయితే.. ఈ ఫ్యాక్టరీని 12న మోదీ జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది మార్చ్‌లోనే ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ తాజాగా మోదీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు.

Exit mobile version