మరికొన్ని గంటల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఏప్రిల్ 29న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో చాలా సర్వే సంస్థలు టీవీకే వైపు మొగ్గు చూపించాయి. తాజాగా వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్‌లో కూడా విజయ్ పార్టీ వైపే అంచనాలు వస్తున్నాయి. దీంతో టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం రేకెత్తుతోంది. అంతేకాకుండా ప్రధాన పార్టీలు విజయ్‌తో టచ్‌లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియడం లేదు.
ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్సాహంతో ఉన్న విజయ్ తాజాగా ఆలయాల బాట పట్టారు. ఆలయాల సందర్శన చేపడుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వేలన్కన్ని చర్చి దగ్గర వేలాది మంది అభిమానులు గుమిగూడారు. టీవీకే విజయం అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చర్చి తర్వాత ఒక దర్గాను కూడా విజయ్ సందర్శించనున్నారని వార్తలొస్తున్నాయి.
చర్చిలో వేలాది మంది అభిమానులు ఫోన్లలో ఫొటోలు తీస్తూ కనిపించారు. విజయ్‌కు అనుకూలంగా కేరింతలు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా.. శాంతించమని అధికారులు కోరినా పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే విజయ్ ఇటీవల ఏప్రిల్ 29న మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని, ఏప్రిల్ 28న తమిళనాడులోని తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని సందర్శించారు.
இன்று வேளாங்கண்ணியில் TVK தலைவர் விஜய் #வேளாங்கண்ணி #thalapathyvijay #tvk pic.twitter.com/mVFmdfTIBP
— Mr.Raja (@Mr_ItsRaja) May 2, 2026
Wonderla Wave Pool #TVK Party Song Crowd Enjoyed 🙌🙌💥…!! #TVKVijay #TVK #ThalapathyVijay pic.twitter.com/Q2Gc1eZBVl
— ᴀᴀᴅʜɪ ᴠᴊ࿐ (@Aadhi07_VJ) May 2, 2026
Vijay doesnt even realise the harm he is doing to a generation by not controlling and guiding them properly.pic.twitter.com/hQfpeZT8FX
— 𝗕𝗮𝗹𝗮𝗷𝗶 𝗦𝗮𝗻𝗸𝗮𝗿𝗮 𝗦𝗮𝗿𝗮𝘃𝗮𝗻𝗮𝗻 (@vbss75) May 1, 2026
வேளாங்கண்ணி மாதா கோவிலில் தலைவர் விஜய் அவர்களை எதிர்பார்த்து காத்திருந்த மக்கள் மற்றும் இளைஞர்கள் கூட்டம் pic.twitter.com/QSLawo4gTY
— TVK Virtual Warriors HQ (@TVKWarriorsHQ) May 2, 2026
