Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సమాజంలో పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది రెండు ఆత్మల అనుసంధానం, ఒక పవిత్రమైన వ్యవస్థ. కాలక్రమేణా మారుతున్న సామాజిక విలువలు, ఆధునిక సంబంధాల మధ్య పెళ్లి పట్ల ఉన్న గౌరవం తగ్గుతోందని కొందరు భావిస్తుంటారు. అయితే.. వివాహం అనేది సరైన సమయంలోనే జరుగుతుందని నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు. పెళ్లి చేసుకోనంత మాత్రాన ఆ వ్యవస్థపై నమ్మకం లేదని అనుకోవడం పొరపాటు, అది ఒక గొప్ప బాధ్యతగా భావించేవారు కూడా ఉంటారు.
శక్తిమాన్ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీనియర్ హీరో ముఖేష్ ఖన్నా తాజాగా తన పెళ్లి, ప్రేమ మరియు సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 67 ఏళ్ల వయస్సులోనూ తాను అవివాహితుడిగా ఎందుకు ఉన్నానో వివరిస్తూ, తనకు వివాహ వ్యవస్థపై ఇతరుల కంటే ఎక్కువ గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..
- CM Chandrababu: ఓటు ఒక ఆయుధం.. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం
- Annamalai: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. అన్నామలై కీలక ప్రకటన..
- Hair Oiling Tips: తలస్నానం చేయడానికి ముందు నూనె రాయాలా? లేక తర్వాత రాయాలా? డౌట్ క్లియర్ చేసుకోండి..
పెళ్లి అనేది ఒకరి విధిలో రాసి పెట్టి ఉంటుందని, భార్య అనుకోకుండా రాదని ముఖేష్ ఖన్నా నమ్ముతారు. తనను పెళ్లి చేసుకోవాల్సిన మహిళ ఎక్కడో ఒకచోట ఉంటుందని, విధి కలిపినప్పుడు కచ్చితంగా పెళ్లి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పెళ్లికి వయస్సుతో సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామికి కట్టుబడి ఉండాలని ఆయన తెలిపారు. స్త్రీ ‘పతివ్రత’గా ఉండాలని కోరుకునే సమాజం, పురుషుడు కూడా అలాగే ఉండాలని ఎందుకు చెప్పదని ఆయన ప్రశ్నించారు. భార్యను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఇతర సంబంధాలు పెట్టుకోవడం మోసమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రేమ అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే కలుగుతుందని, ఆ తర్వాత వచ్చేవి కేవలం ఆకర్షణ లేదా కోరిక మాత్రమేనని ఆయన వివరించారు. ఒకరికి ‘ఐ లవ్ యు’ అని చెప్పి, ఆ తర్వాత మరొకరి వద్దకు వెళ్లడం కృతజ్ఞత లేని పని అని ఆయన విమర్శించారు. వివాహ వ్యవస్థపై ముఖేష్ ఖన్నాకు ఉన్న ఈ నమ్మకం, నిబద్ధత పట్ల ఆయన చూపిన గౌరవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
FSSAI: చిన్నారులకు చక్కెర పెడుతున్నారా?
-
MS Dhoni: ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ.. ఎంఎస్ ధోనీ వీడియో వైరల్!
-
CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..
-
RC 17: రామ్ చరణ్ #RC17 పూజా కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
-
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!