Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- బజల్‌పూర్ బోట్ ట్రాజెడీ..
- లైఫ్ జాకెట్ ఉన్నా తల్లీబిడ్డ ఎలా మరణించారు.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabalpur Boat Tragedy: మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో జరిగిన బోట్ ప్రమాదం దేశవ్యాప్తంగా అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. 29 మంది ప్రయాణికులతో బార్గి డ్యామ్ సమీపంలో నర్మదా నదిలో క్రూయిజ్ బోట్ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు. విపరీతమైన ఈదుదు గాలులతో ఒక్కసారిగా బోట్‌లో గందరగోళం ఏర్పడింది. పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది ‘‘లైఫ్ జాకెట్’’ వేసుకోకపోవడం వల్ల నీటిలో మునిగి మరణించారు.
అయితే, ఈ ప్రమాదంలో ఒక తల్లి తన బిడ్డను కడ దాకా కాపాడే ప్రయత్నం చేసిన ఫోటో వైరల్ అయింది. ఆ పిల్లాడిని తన గుండెలకు హత్తుకుని మరణించింది. తల్లిబిడ్డల మృతదేహాలు ఆ విధంగా చూసిన దేశం మొత్తం కన్నీరు కార్చింది. ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నించిందనేది వెల్లడైంది. ఈ ఘటనలో తల్లి లైఫ్ జాకెట్ వేసుకున్నా ఎలా ముగినిపోయిందనేది కీలకంగా మారింది. లైఫ్ జాకెట్ ఉంది కదా, ఎందుకు నీటిలో మునిగిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Read Also: PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో సరికొత్త విప్లవం
క్రూయిజ్ బోట్ లోయర్ డెక్‌లో ఏసీ క్యాబిన్ ఉంది. ఇందులో చాలా మంది పర్యాటకులు ఉన్నారు. ఒక్కసారిగా ఈదురుగాలులు రావడం, బోటు నీటిలో వేగం కదలడంతో భయాందోళనకు గురయ్యారు. ఒక వేళ క్యాబిన్‌లో ఉంటే లైఫ్ జాకెట్ వేసుకున్నా, అందులోనుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వేగంగా నీరు క్యాబిన్‌లోకి రావడంతో లైఫ్ జాకెట్ ఉన్నా కూడా బయటకు వచ్చేందుకు సహయపడదు. నీరు వేగంగా చేరడంతో క్యాబిన్‌లో గాలి పీల్చుకునే అవకాశం కూడా ఉండదు.
భయాందోళనకు గురైన ప్రయాణికులు లైఫ్ జాకెట్లు సరిగా ధరించలేకుండా ఉండొచ్చు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బోట్ మునిగిపోయింది. తక్కువ సమయంలో అందరూ లైఫ్ జాకెట్ వేసుకోలేకపోయారు. దీనికి తోడు బోట్ నిర్వాహకులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు. ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలని సూచించలేదు. ఇవన్నీ కలిసి 11 మంది మరణాలకు కారణమయ్యాయి. సంతోషంగా సాగాల్సిన ప్రయాణం విషాదంగా ముగిసింది. కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చింది.
Inside footage of the Jabalpur cruise just moments before it sank, water rapidly flooding in, life jackets being handed out in panic and then, the unthinkable happens pic.twitter.com/In0w5B5fXC
— Surajit (@surajit_ghosh2) May 2, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!