NTV Telugu Site icon

Lust Stories 2 : తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించిన విజయ్ వర్మ..

Whatsapp Image 2023 06 22 At 1.34.26 Pm

Whatsapp Image 2023 06 22 At 1.34.26 Pm

స్టార్ హీరోయిన్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు అయిన విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. విజయ్ వర్మ కూడా ఈ విషయంలో తన అభిప్రాయం తెలిపాడు.. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతోందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ్ తమన్నా ని ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ ను చేశాడు. తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఆ కామెంట్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

తమన్నా-విజయ్‌ వర్మ వీరిద్దరూ కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ లస్ట్‌ స్టోరీస్‌2. రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈనెల 29న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌‎లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఈ క్రమంలో విజయ్‌ వర్మ ఓ ఇంటర్వ్యూలో తమన్నాతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.”లస్ట్ స్టోరీస్ 2 కథ చదవగానే హీరోయిన్ ఎవరని నేను అడిగాను. తమన్నా అని చెప్పడంతో వారి సెలక్షన్ బాగుందని అనిపించింది. ఆ పాత్రకు తమన్నా ఎంతో పర్ఫెక్ట్‎గా సెట్ అవుతుంది. నిజానికి తన నటనతో ఈ సిరీస్ కు మరింత గ్లామర్‎ను తీసుకువచ్చింది. ఏ పాత్ర అయినా కూడా తమన్నా తన నటనతో మెప్పిస్తుంది..పాత్రకు సరిగ్గా న్యాయం చేస్తుంది. మన కో యాక్టర్స్ యాక్టివ్‎గా ఉంటే షూట్ ఎంతో సరదాగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.. తమన్నా నటించిన బాహుబలి, బబ్లీ బౌన్సర్, సినిమాలు నేను చూశాను. అందులో ఆమె నటన ఎంతో అద్భుతంగా ఉంది.లస్ట్ స్టోరీస్ 2 చూశాక అందరూ ఆమెను తప్పకుండా ప్రశంసిస్తారు” అని విజయ్ వర్మ చెప్పుకొచ్చారు.ఈ సిరీస్ లో కూడా తమన్నా కొన్ని బోల్డ్ సీన్సలో నటించినట్లు సమాచారం.తమన్నా వరుసగా వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఈ సిరీస్ కు కనుక మంచి టాక్ వస్తే ఆమె మరో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉంది.

Show comments