Lust Stories 2 : తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించిన విజయ్ వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు అయిన విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. విజయ్ వర్మ కూడా ఈ విషయంలో తన అభిప్రాయం తెలిపాడు.. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతోందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ్ తమన్నా ని ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ ను చేశాడు. తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఆ కామెంట్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
తమన్నా-విజయ్ వర్మ వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్2. రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈనెల 29న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఈ క్రమంలో విజయ్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తమన్నాతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.”లస్ట్ స్టోరీస్ 2 కథ చదవగానే హీరోయిన్ ఎవరని నేను అడిగాను. తమన్నా అని చెప్పడంతో వారి సెలక్షన్ బాగుందని అనిపించింది. ఆ పాత్రకు తమన్నా ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నిజానికి తన నటనతో ఈ సిరీస్ కు మరింత గ్లామర్‌ను తీసుకువచ్చింది. ఏ పాత్ర అయినా కూడా తమన్నా తన నటనతో మెప్పిస్తుంది..పాత్రకు సరిగ్గా న్యాయం చేస్తుంది. మన కో యాక్టర్స్ యాక్టివ్‌గా ఉంటే షూట్ ఎంతో సరదాగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.. తమన్నా నటించిన బాహుబలి, బబ్లీ బౌన్సర్, సినిమాలు నేను చూశాను. అందులో ఆమె నటన ఎంతో అద్భుతంగా ఉంది.లస్ట్ స్టోరీస్ 2 చూశాక అందరూ ఆమెను తప్పకుండా ప్రశంసిస్తారు” అని విజయ్ వర్మ చెప్పుకొచ్చారు.ఈ సిరీస్ లో కూడా తమన్నా కొన్ని బోల్డ్ సీన్సలో నటించినట్లు సమాచారం.తమన్నా వరుసగా వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఈ సిరీస్ కు కనుక మంచి టాక్ వస్తే ఆమె మరో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉంది.
Also Read
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
- Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
తాజావార్తలు
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
-
Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
-
Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!