Vijay-Trisha: త్రిష నాదే..? తమిళనాడు నాదే.. విజయ్ విజయధరహాసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో అరవై ఏళ్ళ ద్రవిడ పార్టీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ, దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ అఖండ విజయం దిశగా దూసుకుపోతున్నారు. అటు రాజకీయంగా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంతో పాటు, ఇటు వ్యక్తిగత జీవితంలో కూడా నటి త్రిషతో అనుబంధంపై వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో “త్రిష నాదే.. తమిళనాడు నాదే” అనే నినాదంతో వైరల్ అవుతున్నాయి. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీలను సింగిల్ హ్యాండ్తో ఎదుర్కొని విజయ్ సాధించిన ఈ విజయం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ వైపు శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం విజయ్ 108 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండి, స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎటువంటి ముందస్తు పొత్తులు లేకుండానే డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను వెనక్కు నెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించడం భారత రాజకీయాల్లోనే ఒక సంచలనం.
Also Read
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
- టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. అటు సీఎంగా పగ్గాలు చేపట్టబోతుండటంతో పాటు, ఇటు త్రిషతో పెళ్లి వార్తలపై వస్తున్న స్పష్టత అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. విజయ్ తన భార్య సంగీతతో విడాకుల ప్రక్రియ పూర్తికాగానే త్రిషను వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే త్రిష పుట్టినరోజు కావడం, ఆమె తిరుమల శ్రీవారిని సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
గత కొంతకాలంగా వ్యక్తిగతంగానూ, సినీ రంగంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విజయ్, ఇప్పుడు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడుతుండటంతో తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మెజారిటీ తగ్గితే కాంగ్రెస్, పీఎంకే వంటి పార్టీల మద్దతు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విజయ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మొత్తానికి “తమిళనాడు నాదే.. త్రిష నాదే” అనే డైలాగ్ విజయ్ ఫ్యాన్స్కు సరికొత్త జోష్ ఇస్తోంది.
తాజావార్తలు
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!