NTV Telugu Site icon

Vijay Sethupathi:ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఏడుగురు ఎవరంటే?

Vijay Sethupathi

Vijay Sethupathi

తమిళ్ పాన్ ఇండియా స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..ఒక్క సౌత్ లోనే కాదు.. నార్త్‏లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఒక్కో సినిమాతో నట విశ్వరూపాన్ని చూపిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు..కేవలం హీరోగానే కాకుండా.. పవర్ ఫుల్ విలన్‏గానూ అదరగొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా రాయనం పాత్రలో విజయ్ నటన గురించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ చిత్రాల్లోనూ మెప్పించారు.

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు విజయ్. నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలోనై నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు విజయ్ సేతుపతి..మూడు, నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..అయితే విజయ్ సేతుపతి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది..ఇన్ స్టాలో కేవలం తన అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తుంటారు విజయ్. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పబ్లిసిటి చేసేందుకు ఇష్టపడరు. ప్రస్తుతం ఇన్ స్టాలో సేతుపతికి 7.3 మిలియన్ అంటే 73 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.. కానీ విజయ్ మాత్రం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు..

నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ డైరెక్టర్ మిస్కిన్, హీరోయిన్ అంజలి, కోలీవుడ్ నటుడు రమేష్ తిలక్, కోలీవుడ్ గేయ రచయిత కార్తీక్ నేత, డైరెక్టర్ రంజిత్ జయకోడి, తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.. ఇకపోతే కమల్ హాసన్ సినిమాలో నటిస్తున్నారు..ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చేస్తున్న కమల్.. ఆ తర్వాత హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు.. ఆ సినిమాలో కమల్ హాసన్ కు విలన్ గా తలపడనున్నాడు.. అంతేకాదు మరి కొన్ని ప్రాజెక్టు లలో నటిస్తున్నాడు..