NTV Telugu Site icon

Vijay Sethupathi-Fan: అభిమాని ఇంట్లో స్టార్‌ హీరో సందడి.. వీడియో వైరల్!

Vijay Sethupathi Fan

Vijay Sethupathi Fan

Vijay Sethupathi Meets Fan in Madurai: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర నచ్చితే చాలు.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తమిళ్ సినిమాలతో పాటు తెలుగు, హిందీలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సహజ నటనతో ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన అభిమానులకు కూడా ఆయన ఎంతో విలువిస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్‌కు చెందిన జయబాస్, జయపాల్ సోదరులు విజయ్‌ సేతుపతికి పెద్ద అభిమానులు. ఇద్దరిలో ఒకరు జిల్లా అభిమాన సంఘానికి అధ్యక్షుడు కాగా.. మరోకరు జిల్లా ఉప కార్యదర్శి. మే 2న జయబాస్, జయపాల్‌లు తమకు నచ్చిన యువతులను వివాహం చేసుకున్నారు. తమ పెళ్లికి రావాలని వీరు విజయ్‌ సేతుపతిని కోరారు. అయితే ఆ రోజు సినిమా షూటింగ్‌ ఉండటంతో.. పెళ్లికి హాజరు కాలేకపోయారు. దాంతో మక్కల్ సెల్వన్ నేడు తన అభిమానుల ఇంటికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Allu Arjun vs Keerthy Suresh: అల్లు అర్జున్‌కు పోటిగా కీర్తి సురేష్!

విజయ్ సేతుపతి నటించిన తాజా సినిమా ‘మహారాజా’ ట్రైలర్ నేడు విడుదలైంది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా వస్తుండటంతో.. ఆయన ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిథిలన్ సామినాథన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ ప్రస్తుతం మహారాజా, ట్రైన్, ఏస్ చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో జవాన్, కత్రినా కైఫ్‌తో మెర్రీ క్రిస్మస్ చిత్రాల్లో నటించాడు.

Show comments