Site icon NTV Telugu

Vijay Sethupathi : ఆ కుటుంబానికి అండగా నిలబడిన విజయ్ సేతుపతి..బాసూ నువ్వు గ్రేట్

New Project (38)

New Project (38)

Vijay Sethupathi : విజయ్ సేతుపతి సౌత్ ఇండియాలోని విలక్షణ నటులలో ఒకరు. ఇటీవల ఆయన మహారాజా చిత్రంతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్నాడు. ఈ సినిమా సందేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి తన నట విశ్వరూపాన్ని చూపించాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన విజయ్ సేతుపతి ఇటీవల తన మంచి మనసుని చాటుకుని వార్తల్లో నిలిచాడు. ప్రముఖ హాస్యనటుడు తెనాలి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని విజయ్ సేతుపతి దృష్టికి వెళ్లగా, విజయ్ సేతుపతి వారికి అండగా నిలిచారు. తెనాలి విజయ్ సేతుపతి నటించిన కొన్ని చిత్రాలలో హాస్యనటుడి పాత్రలు పోషించారు.

Read Also:YSRCP: అలర్ట్‌ అయిన వైసీపీ.. కడప జడ్పీటీసీలకు అధిష్టానం పిలుపు..

తెనాలి కుమారుడు విన్నరప్పన్‌ డాక్టర్‌ ఎంజీఆర్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. ట్యూషన్‌ ఫీజు చెల్లించడంలో విన్నరప్పన్‌ ఇబ్బందులు పడుతున్నాడని తెలిసి విజయ్‌ సేతుపతి అండగా నిలిచారు. విజయ్ సేతుపతి సాయంపై స్పందించిన తెనాలి.. నా కుటుంబానికి సాయం చేసిన విజయ్ సేతుపతిని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పలువురు ఆర్టిస్టులకు విజయ్ సేతుపతి సాయం చేస్తూ వార్తల్లో నిలిచారు. విజయ్ సేతుపతి లాంటి మంచి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. విజయ్ సేతుపతి తక్కువ సమయంలో 50 సినిమాలను పూర్తి చేశారు. ఆయన తెలుగు, తమిళ్ తో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించారు. విజయ్ సేతుపతికి తెలుగులోనూ ఊహించని ఆఫర్లు వస్తున్నాయి. అయితే కథ అద్భుతంగా ఉంటేనే విజయ్ సేతుపతి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని భోగట్టా. విజయ్ సేతుపతి కెరీర్ పరంగా భారీ హిట్స్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Read Also:Turkey Parliament: టర్కీ పార్లమెంట్‌లో పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు.. ఎందుకంటే?

Exit mobile version