Kavya-Anirudh Reception: తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ (CM Vijay), ఆయన భార్య సంగీత స్వర్ణలింగం (Sangeetha Sornalingam) ఒకే వేడుకకు వేర్వేరుగా హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సహ-యజమాని, సీఈఓ కావ్య మారన్ (Kavya Maran) వివాహ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అతిథులందరి కళ్లూ విజయ్, సంగీతలపైనే నిలిచాయి.
చాలా కాలం తర్వాత సంగీత ఇలా ఒక పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. గతంలో తమ కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమైన ‘సిగ్మా’ (Sigma) సినిమా రిలీజ్ సమయంలో పిల్లలతో కలిసి కనిపించిన సంగీత, మళ్లీ ఇన్ని నెలల తర్వాత బయట కనిపించడం ఇదే రెండోసారి. మరోవైపు, విజయ్ సంప్రదాయ దుస్తుల్లో ఒంటరిగా ఈ వేడుకకు వచ్చారు. నేరుగా స్టేజ్ పైకి వెళ్లి నూతన వధూవరులు అనిరుధ్, కావ్యలకు శుభాకాంక్షలు తెలిపి, వారితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.
ఇదిలా ఉండగా.. 1999 ఆగస్టులో వివాహం చేసుకున్న విజయ్, సంగీత దంపతులకు జాసన్ సంజయ్, దివ్య సాషా (Divya Saasha) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా గత కొన్నేళ్లుగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. విజయ్ రాజకీయ ప్రచారాలకు, సినిమా ఫంక్షన్లకు సంగీత పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ (Divorce Petition) దాఖలు చేయడం పెద్ద సంచలనం రేపింది. ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని, తాను ఎంత వద్దని వారించినా ఆయన ఆ సంబంధాన్ని కొనసాగించడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆమె ఆ పిటిషన్లో ఆరోపించారు. అయితే కోర్టులో కొన్ని విచారణలు జరిగిన తర్వాత, సంగీత ఆ విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. విడాకులు వెనక్కి తీసుకున్న తరువాత కూడా ఈ వేడుకకు ఇద్దరు విడివిడిగా హాజరవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

