Site icon NTV Telugu

Vijay – Rashmika: పాపం.. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివర్రా..

Vijay Rashmika

Vijay Rashmika

Vijay – Rashmika: ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న వార్తల్లో ముందు వరుసలో ఉండే వార్తలు.. హీరో విజయ్ దేవరకొండ – హీరోయిన్ రశ్మిక మందన్న పెళ్లికి సంబంధించినవే అంటే అతిశయోక్తి కాదు. నిజానికి కొందరు సోషల్ మీడియాలో వారి పెళ్లి, రిసెప్షన్ కు సంబంధించిన అన్ని వివరాలను పోస్టులు చేస్తూ.. వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. అలా భంగం కలిగిస్తున్నామనే విషయం తెలియకుండానే కొందరు వారి ఖాతాల్లో ఈ ఎలాంటి అధికారిక ప్రకటన చేయని పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేస్తున్నారు.

READ ALSO: జీహెచ్‌ఎంసీ ‘MyCURE’ యాప్ లాంఛ్.. ఫిర్యాదులపై రియల్‌టైమ్ ట్రాకింగ్

ఈ పెళ్లి వార్తలు నిజం అయితే, వాటికి హాజరయ్యే ప్రముఖులైన అతిథులకు ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతాయో అనేది ఆలోచించే పరిస్థితుల్లో ఈ పోస్టులు చేసే వారు లేరని అనిపిస్తుంది. ఈ స్టార్ హీరో-హీరోయిన్ వివాహం జరిగితే, దానికి బాలీవుడ్ , టాలీవుడ్‌కు చెందిన ఎంతో ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలన్నీ వెల్లడి చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వెడ్డింగ్ కార్డులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం అనేది ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాబట్టి ఈ పెళ్లి వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సంయమనం పాటించాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం, అలాంటి పర్సనల్ ఈవెంట్‌కు సంబంధించి పోస్ట్‌లు చేసే ముందు ఆ పోస్ట్ ల ద్వారా ఎదుటి వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచిస్తే మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయి.

READ ALSO: Abhishek Sharma: అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు!

Exit mobile version