Site icon NTV Telugu

Vijay Mallya: మరోసారి వార్తల్లో విజయ్ మాల్యా.. గేల్‌తో ఫొటోలు వైరల్

Vijay Mallya And Chris Gayle Photo

Vijay Mallya And Chris Gayle Photo

భారత్‌లోని బ్యాంకులకు కోట్ల రూపాయల ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. విజ‌య్ మాల్యా ఇవాళ త‌న ట్విట్టర్‌లో క్రిస్ గేల్ ఫోటోను షేర్ చేశాడు. “సూపర్ ఫ్రెండ్‌షిప్, బెస్ట్ అక్విజిషన్” అం‍టూ వెస్టిండీస్ క్రికెటర్‌ క్రిస్ గేల్‌తో ఉన్న ఫోటోను తాజాగా ట్వీట్‌ చేయడం విశేషంగా నిలిచింది. ‘‘క్రిస్టోఫర్ హెన్రీ గేల్, ‘యూనివర్స్ బాస్‌’ను కలుసుకోవడం అదృష్టం. ఆర్సీబీకి తీసుకున్నప్పటినుంచి మంచి స్నేహితుడు” అని మాజీ ఆర్సీబీ యజమాని విజయ్ మాల్యా పేర్కొన్నాడు. ఆర్సీబీకి గేల్‌ను కొనుగోలు చేయడం ఎప్పటికీ బెస్టే అంటూ రాసుకొచ్చాడు. ఒక‌ప్పుడు ఐపీఎల్‌లో బెంగుళూరు జ‌ట్టుకు ఓన‌ర్‌గా మాల్యా ఉన్న స‌మ‌యంలో.. ఆ జ‌ట్టుకే క్రిస్ గేల్ ఆడేవాడు.
2011 నుంచి 2017 సీజ‌న్ వ‌ర‌కు రాయ‌ల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు జ‌ట్టుకు యూనివ‌ర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే ఇటీవ‌ల గేల్‌ను మాల్యా క‌లిశాడు. ఈ సంద‌ర్భంగా త‌న ట్విటర్‌లో ఓ ఫోటోను పోస్టు చేశాడు. ఆ ఫొటోను చూసి గేల్‌ పరుగుల సునామీ గురించి నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కేవలం 30 బాల్స్‌లోనే సెంచరీ బాదిన మెమరబుల్‌ ఇన్నింగ్స్‌ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో ‘లిక్కర్‌ కింగ్‌ విత్‌ యూనివర్స్‌ బాస్‌’ అంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ కావడం మాత్రమే కాదు చర్చనీయాంశంగా మారింది.

ఆర్సీబీకి గేల్‌ను తానే రిక్రూట్ చేశాన‌ని, అప్పటి నుంచి త‌మ మ‌ధ్య సూప‌ర్ ఫ్రెండ్‌షిప్ ఉన్నట్లు త‌న ట్వీట్‌లో మాల్యా తెలిపాడు. మాల్యా చేసిన ట్వీట్‌కు గంట‌ల్లోనే కొన్ని వేల లైక్‌లు వచ్చాయి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌, కోల్‌క‌తా జ‌ట్ల త‌ర‌పున కూడా గేల్ ఆడాడు. ఐపీఎల్‌లో మొత్తం 142 మ్యాచ్‌లు ఆడిన అత‌ను 4965 ర‌న్స్ చేశాడు. స్ట్రయిక్ రేట్ 148.96 కాగా, బ్యాటింగ్ స‌గ‌టు 39.72గా ఉంది. ఐపీఎల్‌లో గేల్ ఆరు సెంచ‌రీలు కొట్టాడు. 2013లో పూణెపై అత్యధికంగా 175 ర‌న్స్ చేశాడు. అయితే, ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి దూరంగా ఉన్నాడు.

Exit mobile version