Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్‌లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay TVK Controversy: విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. విజయ్ గవర్నర్‌ను కలిసిన తీరు ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి దారితీసింది. లోక్ భవన్‌లో గవర్నర్‌తో జరిగిన ఈ కీలక భేటీలో విజయ్ వెంట ఇద్దరు వ్యక్తులు కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వారు మరెవరో కాదు.. విజయ్ తదుపరి చిత్రం ‘జననాయగన్’ నిర్మాత వెంకట్ కె. నారాయణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త విష్ణురెడ్డి. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని, పార్టీలో ఎటువంటి అధికారిక హోదా లేని వ్యక్తులు ప్రభుత్వ ఏర్పాటు వంటి అత్యంత కీలకమైన చర్చల సమయంలో గవర్నర్ వద్దకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వెంకట్ కె. నారాయణ సినీ రంగానికి చెందిన వ్యక్తి, ఇక విష్ణు రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో గ్రానైట్, మైనింగ్ వ్యాపారాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ భేటీలో వీరు ఉండటంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
“తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించే చర్చల్లో కర్ణాటకకు చెందిన సినీ నిర్మాత, ఆంధ్రకు చెందిన గ్రానైట్ వ్యాపారికి ఏం పని?” అని ఒక వినియోగదారుడు ప్రశ్నించగా.. “వీరు బయటి వ్యక్తులు, తమిళనాడు రాజకీయాల్లో వీరి పాత్ర ఏంటి? రేపు వీరే ప్రభుత్వం నడుపుతారా?” అంటూ మరికొందరు మండిపడుతున్నారు. అసలు రాజకీయ హోదా లేని ప్రైవేట్ వ్యక్తులను అధికారిక భేటీకి గవర్నర్ కార్యాలయం ఎలా అనుమతించిందనే కోణంలోనూ వివరణ కోరుతున్నారు. ప్రస్తుతానికి వీరికి పార్టీలో ఎలాంటి పదవులు లేవని తెలుస్తోంది. కేవలం విజయ్‌తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్లే వెళ్లినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వీసీకే (VCK) పార్టీ ఇంకా మద్దతు లేఖ ఇవ్వకపోవడం, ఐయూఎంఎల్ (IUML) డీఎంకే కూటమిలోనే ఉండాలని నిర్ణయించుకోవడం వంటి పరిణామాలు విజయ్ రాజకీయ ప్రయాణంలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇటు కూటమి చర్చలు, అటు వెంట వచ్చిన వ్యక్తులపై రేగుతున్న వివాదాలతో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
-
OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?