Vijay Deverakonda to share Kushi Movie Info in Star Sports: మరో రెండు రోజుల్లోనే ఆసియా కప్ 2023కు తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ సారి ఆసియా కప్ మ్యాచ్‌లు పాకిస్థాన్, శ్రీలంకలో జరుగుతాయి. పాక్ వెళ్లమని భారత్ అనడంతో టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో రెండు దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఆతిథ్య హోదాలో పాక్‌లో 4 మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఆసియా కప్ 2023 మ్యాచ్‌లను అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్ చూడొచ్చు. అయితే తెలుగు అభిమానులకు ఫుల్ కిక్కేంచేందుకు టాలీవుడ్ స్టార్ హీరోను స్టార్ స్పోర్ట్స్ రంగంలోకి దించుతోంది. క్రికెట్ అభిమానులను ‘ఖుషీ’ చేసేందుకు ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ వస్తున్నాడు. ఆగస్టు 30న మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ స్పోర్ట్స్‌లో విజయ్.. తన క్రికెట్ మెమోరీస్ సహా ఖుషీ మూవీ ముచ్చట్లను అభిమానులతో పంచుకోనున్నాడు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది.
Also Read: NTR Shata Jayanthi: నేడు ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల.. 200 మంది అతిథులు! జూనియర్ వెళ్తారా?
‘ఖుషి ఖుషీగా తన క్రికెట్ మెమోరీస్ మరియు ఖుషీ మూవీ ముచ్చట్లను మనతో పంచుకోడానికి మీ స్టార్ స్పోర్ట్స్ తెలుగులో వచ్చేస్తున్నారు మన డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ. మరి మిస్ కాకుండా చూడండి’ అని స్టార్ స్పోర్ట్స్ తన ఎక్స్‌లో ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయింది. ఐపీఎల్ 2023 ఓపెనింగ్ రోజు (మార్చి 31న) ‘నందమూరి నటసింహం’ బాలకృష్ణ కామెంటరీ చెప్పిన విషయం తెలిసిందే.
ఖుషి ఖుషీగా తన క్రికెట్ మెమోరీస్ ని & #Kushi మూవీ ముచ్చట్లను 😍
మనతో పంచుకోడానికి @StarSportsTel లో వచ్చేస్తున్నారు మన డైనమిక్ హీరో @TheDeverakonda 😎💥మరి మిస్ కాకుండా చూడండి📺#AsiaCupOnStar
AUG 30 | 2 PM నుండి
మీ #StarSportsTelugu & Disney+ Hotstar లో pic.twitter.com/3pJ8Zktzca— StarSportsTelugu (@StarSportsTel) August 27, 2023