Site icon NTV Telugu

Vijay Deverakonda : ఏం లుక్స్ రా బాబోయ్.. రక్తం, గన్స్‌తో విజయ్ – రష్మిక!

Rowdy Janardhana,mysaa Rashmika , Vijay Devarakonda

Rowdy Janardhana,mysaa Rashmika , Vijay Devarakonda

ఒకప్పుడు ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాలతో క్యూట్ లవర్స్‌గా మెప్పించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన వీరిద్దరి సినిమాల లుక్స్ చూస్తుంటే “ఎలా ఉండేవాళ్ళు.. ఇలా అయిపోయారేంటి?” అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhana) లో ఫుల్ రగ్డ్ లుక్‌లో, ఒళ్లంతా రక్తంతో భయంకరంగా కనిపిస్తుంటే, రష్మిక మందన్న కూడా తన సినిమా ‘మైసా’ (Mysaa) గ్లింప్స్‌లో గన్‌ పట్టుకుని పక్కా యాక్షన్ మోడ్‌లోకి మారిపోయింది.

Also Read : Eesha Movie : సంతకం పెట్టాకే సినిమా.. ‘ఈషా’ షాకింగ్ ప్రమోషన్..

కాబోయే భార్యాభర్తలైన ఈ జోడీ, ఒకేసారి ఇలాంటి వయలెంట్ లుక్స్‌తో రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక అయితే తన పోస్ట్‌లో “ఇది కేవలం ఒక చిన్న శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది” అంటూ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చింది. ఒకప్పుడు లవ్ స్టోరీలతో సాఫ్ట్‌గా కనిపించిన వీరు, ఇప్పుడు ఇలా ఊర మాస్ అవతారాలు ఎత్తడం చూస్తుంటే థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు వేరే లెవల్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

Exit mobile version