Site icon NTV Telugu

Vijay – Rashmika Wedding : రష్మిక – విజయ్ దేవరకొండల పెళ్లి డేట్ ఇదే..

Vijay Rashmika

Vijay Rashmika

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరికీ  నిశ్చితార్థం జరిగింది కానీ అధికారకాంగా ప్రకటించేలేదు. ఇప్పుడు పెళ్లి తేదీకి సంబంధించి డేట్ లాక్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషి ఉన్నారు.

Also Read : Shashwat Sachdev : ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ ఎంట్రీ.. హింట్ ఇచ్చిన స్టార్ హీరో

 ఈ క్రేజీ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక  ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుంది. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండాగా ఈ ఫిబ్రవరి 2న అనగా ఈ రోజు పెళ్లి అని ప్రచారం జరిగినప్పటికీ అవి ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. లేటెస్ట్ గా ఫిబ్రవరి 26నే ముహూర్తం ఖరారైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో వివాహం ముగిసిన అనంతరం, హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకుల కోసం ఒక భారీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో విజయ్-రష్మిక జంటగా మెరిసి, అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించబోతున్నారట.అయితే, ఇప్పటి వరకు ఈ పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ నేరుగా స్పందించలేదు. కానీ పెళ్లికి సంబందించిన ఏర్పాట్లు మాత్రం చకచక జరుగుతున్నాయి.

Exit mobile version