Betting App Case Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నేడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు నటుడు ప్రకాష్ రాజ్‌ను విచారించారు. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ రోజు విజయ్ దేవరకొండ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో రౌడీ బాయ్ ఏం చెబుతాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాకు కూడా ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అలాగే నటి మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నేడు విజయ్ దేవరకొండ విచారణకు హాజరైతే మనీ లాండరింగ్ కోణాల్లో ఈడీ విచారణ జరపనుంది. బెట్టింగ్ యాప్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్‌లపై ఈడీ అరా తీయనుంది. చట్టవిరుద్ధమైన యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది?, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయనుంది.
Also Read: Bandi Sanjay: బీసీల కోసం కాదు.. ముస్లింల కోసమే కాంగ్రెస్ ధర్నా!
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించి 29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, దివి.. తదితరులపై సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది.
