Site icon NTV Telugu

Vijay Deverakonda: మొన్ననే ఎంగేజ్మెంట్.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ..!

Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Deverakonda: టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం సమీపంలో చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

Rajinikanth: పేరుకే సూపర్ స్టార్.. కానీ ఇంత సింప్లిసిటీ ఏంటయ్యా? రోడ్డు పక్కన భోజనం చేస్తూ..

విజయ్ దేవరకొండ తన మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్‌తో కలిసి పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా, నందికొట్కూరు నుంచి పెబ్బేరుకు పశువులను తీసుకుని వెళ్తున్న ఒక బస్సు అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేసింది. దీంతో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు, ముందున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండ కారు పాక్షికంగా స్వల్పంగా దెబ్బతింది. దీనితో అదృష్టవశాత్తూ కారులో ఉన్న ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.

France Political Crisis 2025: ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు ఎందుకు మారారు.. అసలు ఫ్రాన్స్‌లో ఏం జరుగుతుంది?

ఇటీవల రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం వార్తలు వస్తున్న వేళ ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ప్రమాదం జరిగిన వెంటనే.. విజయ్ దేవరకొండ దెబ్బతిన్న తన కారును అక్కడే వదిలి, మరో కారులో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనపై డ్రైవర్ అందే శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version