Site icon NTV Telugu

Vijay Devarakonda: ఎందుకురా మా దేవరకొండ వెంట ఇలా పడ్డారు.. ఇంత ఓర్వలేని తనమా..!

14

14

ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు నుంచి కాస్త డిఫరెంట్ రివ్యూస్ రావడం వెనక అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా పోలీస్ స్టేషన్లో కూడా నెగటివ్ రివ్యూ పై ఫిర్యాదు చేశారు విజయ్ దేవరకొండ అభిమానులు. సినిమా ఎలా ఉన్నా.. ఒక వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేయడం ఏంటంటని సోషల్ మీడియాలో కూడా అనేక వాదనలు వినపడుతున్నాయి. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కాస్త బాహ్యంగానే విరుచుకుపడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే..

Also read: Thief Devotee: భక్తి మాయలో అమ్మవారి మెడలో మంగళసూత్రం చోరీ చేసిన ఘనుడు..!

‘ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు. ఇంత కసా ..? ఇంత ఓర్వలేని తనమా ..? లేక మావోడి కటౌట్ చూసి భయమా.. ?., ఒక మంచి విలువలతో, సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదు. మీ నెగటివ్ బ్యాచ్ కి వాడంటే ఎలాగూ పడదు. కానీ ఆ ఇష్టపడేవాళ్ళని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు. అయినా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకి మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఏ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరుతెచ్చుకుంటే తప్పా..?’ అంటూ విరుచుక పడ్డారు. దింతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version