NTV Telugu Site icon

Kushi Movie : విజయ్ దేవరకొండ – సమంత ‘ఖుషీ’ మూవీ స్టోరీ లీక్

New Project (19)

New Project (19)

Kushi Movie : చైతుతో బ్రేకప్ తర్వాత హీరోయిన్ సమంత సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. తన సినీ కెరీర్లో తొలిసారిగా పౌరాణిక పాత్ర చేసిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ అయింది. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆశించిన హిట్ సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో సమంత అభిమానులు ఆమె తదుపరి సినిమా పై దృష్టి పెట్టారు. సమంత విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Read Also: IPL 2023: ఆర్సీబీతో పోటీకి సై అంటున్న కోల్ కతా

లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండకు కూడా కెరీర్లో నిలబడాలి అంటే సాలిడ్ హిట్ కావాలి. దీంతో ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. ఖుషీ సినిమాతో హిట్ కొట్టి గత చేదు జ్ఞాపకాలను చెరిపేసుకోవాలని ఇద్దరూ ఆశ పడుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఖుషీ సినిమా అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read Also: Mani Ratnam : కమల్ తో ప్రోమో షూట్ కు రెడీ అంటున్న మణిరత్నం

ఇటీవలే విడుదలైన ఖుషి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా గతంలో పవన్ ఖుషీ టైటిల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ ఖుషి సినిమాకు పవన్ ‘ఖుషి’ సినిమాకి లింక్ ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి పవన్ కళ్యాణ్-భూమిక పాత్రల మధ్య ఈగో ఎలా ఉంటుందో.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత పాత్రల మధ్య కూడా అదే ఇగో అలాగే ఉంటుందనే విషయం బయటకు వచ్చింది. ఇదే నిజమైతే ఈ పాయింట్ నేటి ప్రేక్షకుల పల్స్‌ని టచ్ చేస్తుందని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ, సమంతల మధ్య ప్రేమ యాంగిల్ సినిమాకే హైలైట్ అవుతుంది.

Show comments