NTV Telugu Site icon

Vijay Devarakonda : ఆ నొప్పినుంచి పూర్తిగా కోలుకున్నా..

Vijay Devarakonda

Vijay Devarakonda

టాలీవుడ్‌ హీరో, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే.. ఇటీవల పాన్‌ ఇండియా సినిమా లైగర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీంతో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ దృష్టి సారించారు విజయ్‌. అయితే.. లైగర్‌ షూటింగ్‌ సమయంలో భుజానికి గాయమైంది. ఈ గాయానికి కొన్ని రోజులపాటు రెస్ట్‌ తీసుకోవాలని చెప్పడంతో.. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే.. లైగర్‌ షూటింగ్‌ అనంతరం కూడా.. నొప్పి తగ్గకపోవడంతో ఆ నొప్పితోనే లైగర్‌ ప్రమోషన్స్‌లో కూడా పాల్గొ్న్నారు విజయ్‌. దాదాపు 8 నెలల తరువాత ఇప్పుడు ఆ భుజం గాయం నుంచి పూర్తి కోలుకున్నట్లు విజయ్‌ వెల్లడించారు.
Also Read : Allu Arjun: రియల్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. కేరళ నర్సింగ్ విద్యార్థిని దత్తత!

ఈ మేరకు చేతులు చూపిస్తూ ఓ ఫొటోను షేర్ చేశాడు రౌడీ బాయ్‌. 8 నెలల చికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు విజయ్‌. ‘బీస్ట్ బయటకు రావడానికి ఉబలాటపడుతోంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది’ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో విజయ్‌ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ చేస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కశ్మీర్ లో కొంత భాగం షూటింగ్ చేసిని చిత్రబృందం.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేశారు.