NTV Telugu Site icon

Vijay- Hatya: విజయ్ ఆంటోనీ ‘హత్య’ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు

New Project (13)

New Project (13)

Vijay- Hatya: డాక్టర్ సలీం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైయ్యాడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత వచ్చిన బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బా బాగా దగ్గరయ్యాడు.. తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. బిచ్చగాడు మాదిరి బ్లాక్ బస్టర్ కాకపోయినా వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. అయితే విజయ్ ఆంటోనీ నుండి మరో కొత్త సినిమా వస్తోంది. ఆయన గత చిత్రాల మాదిరిగానే థ్రిల్లర్ జోనర్ లో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ‘హత్య’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు విజయ్ ఆంటోనీ. హత్య ఎలా జరిగిందీ? ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయాలనే తెలుసుకుని మర్డర్ మిస్టరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను విజయ్ ప్రకటించాడు.

Read Also:Covid-19: చైనా కావాలనే కొవిడ్‌ను మనుషులకు ఎక్కించింది: వుహాన్ పరిశోధకుడు

రితికా సింగ్, మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. ఈ హత్య సినిమాను జులై 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తమిళంలో కోలై అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందిస్తు్న్నారు. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, మురళీ శర్మ, జాన్ విజయ్, సంకిత్ బోహ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తమిళరసన్’. ఈ చిత్రాన్ని బాబు యోగేశ్వరన్ తెరకెక్కించారు. అపోలో ప్రొడక్షన్స్, ఎస్.ఎన్.ఎస్. మూవీస్ సంయుక్త సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్. కౌసల్య రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విక్రమ్ రాథోడ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ శివ గంగ ఎంటర్‌ ప్రైజెస్ సంస్థ అధినేత కె బాబు రావు తెలుగు ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Read Also:CM KCR: క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ

Show comments