దక్షిణాది చిత్ర పరిశ్రమ లో లేడీ సూపర్ స్టార్ మంచి పేరు ప్రఖ్యాత లు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు .ఇక నయనతార విగ్నేష్ గత సంవత్సరం జూన్ నెల లో పెళ్లి చేసుకోగా అక్టోబర్ నెల లో వారు సరోగసి ద్వారా కవల మగ పిల్లల కు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తమ పెళ్లిరోజు సందర్భంగా మొదటిసారి వారిద్దరి పిల్లల ఫోటోల ను సోషల్ మీడియా వేదిక గా రివీల్ చేయడం జరిగింది.అంతే కాకుండా విగ్నేష్ నయనతార గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తూ తనుకు మొదటి పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
అయితే తన పెళ్లిరోజు సందర్భం గా నయనతార విగ్నేష్ తన స్నేహితుల తో కలిసి మాట్లాడుతూ ఒక గది లో కూర్చున్నారు. ఆ సమయంలో నే విగ్నేష్ తనకు ఒక సర్ప్రైజ్ ను ఇచ్చాడు.. అందరూ గది లో కూర్చుని మాట్లాడుతుండ గా ఒక వ్యక్తి అక్కడికి ఫ్లూట్ వాయిస్తూ అయితే వచ్చారు.. ఆయన ఎంతో అద్భుతంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండడం తో నయనతార అంతా మైమరిచిపోయి ఒక్కసారి గా కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను హత్తుకొని కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయిందటా.. కొంత సమయానికి ఆ గది మొత్తం ఎంతో ఎమోషనల్ గా మారిపోయిందని తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది.ఇక ఈ దంపతులు మొదటి పెళ్లిరోజు జరుపుకోవడం తో అభిమానులు సోషల్ మీడియా వేదిక గా ఈ జంట కు పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. నయనతార ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని సమాచారం. తన పిల్లలను జాగ్రత్త గా చూసుకోవడాని కి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తాను తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది నయనతార.