NTV Telugu Site icon

Vidya Balan : నా భర్తను చూసిన మొదటి చూపులోనే నాలో లస్ట్ పుట్టింది..

Whatsapp Image 2023 07 06 At 8.22.22 Am

Whatsapp Image 2023 07 06 At 8.22.22 Am

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ విద్యా బాలన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. లేడీ ఒరియెంటెడ్‌ చిత్రాలు అలాగే బయోపిక్‌ సినిమాలతో విద్యాబాలన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె ఎన్నో సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు సిల్క్‌ స్మిత బయోపిక్‌ ‘ది డర్టీ పిక్చర్‌’ మూవీతో స్టార్ గా మారిపోయింది. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇక కహానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్‌ అప్పటి నుంచి వరస ఆఫర్లు ఆమెకు వచ్చాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు పంచుకుంది. ఆమె తన భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమెకు నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో 2012లోనే పెళ్లి జరిగింది. తన భర్త సిద్ధార్థ్‌తో రిలేషన్‌షిప్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.

ఈ క్రమంలో భర్త సిద్ధార్థ్ , తను ఒకరినొకరు ఏవిధముగా ఇష్టపడ్డారో కూడా తెలియ జేసింది విద్య. ‘మాది..లస్ట్ యట్ ఫస్ట్ సైట్ అని నేను అనుకుంటున్నాను. నిజానికి ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా ముందుగా ఫిజికల్‌గానే అట్రాక్ట్ అయ్యాం. ఎందుకంటే తను చాలా హ్యాండ్సమ్ అయితే మంచి లుక్స్‌తో పాటు సిద్ధార్థ్ తను సెక్యూర్‌గా చూసుకునే విధానానికి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను’ అని చెప్పుకొచ్చింది విద్య.మొదట్లో నేను ప్రతి విషయం పట్ల ఓవర్‌గా రియాక్ట్ అయ్యేదాన్నని తెలిపింది విద్య.. ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది.. ముందుగా నాకు సిద్ధార్థ్ ప్రపోజ్ చేశారని విద్యాబాలాన్ తెలిపింది.అలాగే ‘నేను మా నాన్నను నాకు సెక్యూర్డ్ పర్సన్‌గా భావిస్తాను.మా నాన్న ని సిద్ధార్థ్‌లో చూసుకున్నాను. నిజానికి మనం పార్ట్‌నర్‌లో పేరెంట్స్‌ను వెతుక్కుంటాం. ఆ విషయంలో సిద్ధార్థ్ నాకు సెక్యూర్డ్ పర్సన్‌ గా అనిపించాడు. అయితే తను ఎంతో ప్రైవేట్‌గా ఉంటాడు’ అని చెప్పుకొచ్చింది విద్య.నేను కొన్ని సంవత్సరాల క్రితం వరకూ డైరీ రాసేదాన్ని ఇప్పుడు రాయడం మానేసాను.ఒకవేళ ఇప్పుడు డైరీ రాయాల్సి వస్తే నేను కృతజ్ఞతా భావంతో ప్రారంభిస్తా అని చెప్పుకొచ్చింది.